ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురజాడ సూక్తులు -- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 701 3660 252.
August 30, 2020 • T. VEDANTA SURY • Memories

ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారు గురజాడ మరణించిన రెండు సంవత్సరాల తరువాత పుట్టారు.గురజాడ 1915లో మరణిస్తే లక్ష్మీకాంతమ్మగా‌రు 1917లో జన్మిస్తారు. ఆమెకుగురజాడ అన్నా,గురజాడ రచనలన్నా అమితమైన అభిమానం. గురజాడ గురించి ఆమె అన్న మాటలు " ముత్యాల సరాలలోను, కథలలోనూ గల స్త్రీ పాత్రలన్నీ గొప్ప వ్యక్తిత్వం తో కూడుకుని సంఘ దురాచారాలకు ఎదురు తిరిగిన పాత్రలు."  ఇక రాచకొండ విశ్వనాథశాస్త్రి ఉద్దేశంలో" కన్యాశుల్కం '  ప్రపంచంలోకే గొప్ప నాటకం "అని. ఇక అవసరాల సూర్యారావు మాటల్లో " వస్తు ప్రాధాన్యమునుబట్టేగాక  భాషా సౌకుమార్యమును బట్టి ' కన్యాశుల్కం' ఆంధ్రసాహిత్యమునకు అపార సంపదవంటిది." అంటారు. కొడవటిగంటి కుటుంబరావు మాటల్లో " భారతదేశాన్నంత టినీ  మేల్కొల్పదగిన గేయం వ్రాసి గురజాడ వైతాళికుడుఅయ్యాడు. అటుతరువాత  ఈ దేశానికి దారి చూపిన ఘనత  శ్రీశ్రీకి  దక్కింది." అంటారు. ఇలా ఆ‌రుద్ర, వేటూరి సుందరరామమూర్తి, జ్వాలాముఖి  ఎందరో ఎందరో గు‌‌రజాడంటే అభిమానించేవారున్నారు. శ్రీశ్రీ  అయితే ఏకంగా గు‌‌రజాడపై " మహా గు‌రజాడ" అనే మహా గ్రంథాన్నే   వ్రాసాడు. ఇంతమంది రచయితల అభిమానాన్ని పొందినగురజాడ తన సూక్తులు ద్వారా సమాజానికి ఏం చెప్పాడోచూద్దాం ! " బ్రతికి చచ్చియు/ప్రజలకెప్పుడు/ బ్రీతి గూర్చునొ/వాడు ధన్యుడు ! " అని డామన్ పితియస్ కవితలో పేర్కొంటాడు. అలాగే ' మనిషి' అనే కవితలో "మనిషి చేసిన రాయిరప్పకి/మహిమ కలదని సాగి మొక్కుతు/మనుషులంటే రాయిరప్పల/కన్న కనిష్టం/గాను చూస్తావేల బేలా ?/దేవుడెకడో దాగెనంటూ/కొండకోనల వెతుకులాడే/వేలా?/కన్ను తెరిచిన కానబడడో?మనిషిమాత్రుడి యందులేడో? " గురజాడ అంటాడు. ఇక ముత్యాల సరములలో " యెల్ల లోకము వొక్క యిల్లై/ వర్ణ బేధములెల్లకల్లై/వేల యెరుగని ప్రేమబంధము/వేడుకలు కురియ." అనీ, కాసులులో "మరులు ప్రేమని మది తలంచకు......... ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును''అనీ అంటాడుగురజాడ. ఇలా ఆనాటి సమాజానికి, భావితరాలకుఉపయో గకరమైన సూక్తులను తన రచనలలో పేర్కొన్నాడు.  ఇలా చెప్పుకుపోతే ఎన్నో ఉన్నాయి. ఆంధ్రదర్శిని అనే గ్రంథంలో  శ్రీ శ్రీ చెప్పిన మాటల్లో " పూర్వకవిత్వాలలో ఉండే పదాడం  బరపూరిత పద్ధతులకు, నియమాలకు స్వస్తి చెప్పి జానపద సాహిత్య పద్ధతులనుఅవలంభించి తాను చెప్పదలచుకొన్న  సందేశాన్ని ప్రజలకందించాడు. గురజాడ మహాప్రవక్త. ఆయన సందేశం ఇంకా చాలా విపులీకరించవలసి ఉంది. ఆయన కవిత్వాన్ని తరచి చూచిన కొద్దీ ఇంతవరకూ కనిపిం చని కొత్తవిషయాలెన్నో బయటపడుతూ ఉంటాయి."  అంటాడు.   " గురజాడ ఆధిపత్యానికి కల కారణాలు" 
అన్న రచనలో  శ్రీశ్రీ ఇలా అంటాడు '' ఆధునిక సాహిత్య ప్రపంచంలో తెలుగు దేశపు సరిహద్దులకవతల అంతర్జా తీయ కవి సమ్మేళనంలో  తెలుగువారి తరఫున నిలుచోగలిగినవాడు గురజాడ అప్పారావు ఒక్కడే " అని.  ఇలా గురజాడవారి గురించి ఎంత వ్రాసినా తరగనిది. గురజాడ  వారిపై నేను చదివిన విషయాలు నా రచనా వ్యాసాంగంలో ఎంతగానో ఉపయోగకరమైనవిగా నిలిచాయి. ఈనాటితో
గురజాడపై  నా  రచనా వ్యాసాంగాన్ని నిలుపుదల చేస్తున్నాను. రేపు మరికొన్ని విషయాలతో కలుద్దా ( సశేషం)