ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురజాడ సూక్తులు : శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 701 3660 252
August 29, 2020 • T. VEDANTA SURY • Memories

గురజాడ మన తెలుగు జాతికి ఆణిముత్యం లాంటివారు. మహావ్యక్తి, సంస్కృత, ఆంధ్ర , ఆంగ్ల భాషలలో గొప్ప పండితుడు. ఆనాటి సమాజాన్ని విస్తృతంగా చదివినవాడు సామాజిక సమస్యలను హేతువాద దృష్టితో పరిశీలించి,      సామాజిక చైతన్యాన్ని తెచ్చేందుకు తన రచనల ద్వారా విశేష కృషి సల్పినవాడు. గురజాడ మహా సంఘసంస్కర్త.ఆధునిక భాషాసాహిత్యాలను ప్రజలకు రుచి చూపించిన
మహా సాహిత్య యోధుడు. ' మూడు యేభయిల అడుగుజాడ '  అనే గ్రంథం నుండి గురజాడ, శ్రీశ్రీల గురించి  సేకరిం చిన విషయాలను మీ ముందుకు తెస్తున్నాను. " గురజాడఅర్ణవమైతే శ్రీ శ్రీ చూడని లోతుల్లేవు/ గురజాడ అంబరమైతేశ్రీ శ్రీ ఎక్కని ఎత్తుల్లేవు/గురజాడ తెలుగు జాతికి పరువు/ప్రజలభాషకు ఎరువు/మహాకవి శ్రీశ్రీకి దారి చూపిన గురువు గురజాడని చదివిన శ్రీశ్రీ, గురజాడను తన గురువు అన్నాడుమరి శ్రీశ్రీని చదివితే గురజాడ శ్రీశ్రీని ఏమంటాడు?గురువునుమించిన శిష్యుడు అంటాడు. ఇద్దరూ పరస్పరం ఒకరికొకరు
వరం. ప్రపంచ కవి గురజాడ. శ్రీ శ్రీ అక్షరాలా కనుగొన్న బిడ్డ.మరో ప్రపంచకవి శ్రీ శ్రీ --గురజాడ అక్షరాలు కన్నబిడ్డ. అతడు
(శ్రీ శ్రీ) గురజాడ అడుగుజాడ: అతడు ఎందరికో గురజాడ.అతడే శ్రీ శ్రీ ! అంటారు శ్రీ శ్రీ అభిమానులు. ప్రముఖ రచయితలు, సాహితీవేత్తల దృష్టిలో మన గురజాడ: 1.తెలుగు ప్రజలందరి స్మృతిపథంలో అప్పారావు సదా జీవిస్తాడు. చనిపోయినప్పటికీ ఆయన జీవిస్తున్నాడు --- గిడుగు వేంకటరామమూర్తి. 2. " కన్యాశుల్కం" లాంటి ఉత్తమమైన నాటకానికి సరి తూగగల నాటకం నేటివరకు రాలేదని చెప్పక తప్పదు-----గిడుగు వేంకట సీతాపతి. 3. సాహిత్యాన్ని కొత్త పుంతలతో నడిపి  ప్రజా మన్ననలను పొందిన వ్యక్తి మహాకవి గురజాడవారు--- తాపీధర్మారావు. 4. అప్పారావుగారిని మెచ్చుకోనివారు లేరు----చింతా దీక్షితులు.5. సంస్కరించేటప్పుడు తప్ప సాంఘిక చట్టాలను మీరడం నేరమన్నారు అప్పారావుగారు----గుడిపాటి వెంకటాచలం. 6.అప్పారావుగారు మహా శిల్పి,  సంఘ సంస్కర్త---- విశ్వనాథ సత్యనారాయణ.   7.  గురజాడచనిపోయినా, ఆ తరువాతనే జీవించడం ప్రారంభించాడు.---- దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి. 8. అప్పారావుగారు  తమ రచనల్లో అట్టే నీతులు బోధించలేదు. ఆయన చేసిన ప్రబోధమల్లా " దేశమును ప్రేమించుమన్నా' అన్న గేయం ఒక్కటే.దానికి విశ్వవాజ్ఞ్మయములోనే స్థానమున్నది---కొడవటిగంటి కుటుంబరావు. 9. ఫాదర్ ఆఫ్ మోడరన్ తెలుగు పోయెట్రీ 
అనదగిన యోగ్యత గురజాడకే ఉంది. సాంప్రదాయాన్ని మనం పాటిస్తే గురజాడనే లేదా మూలపురుషుడు లేదా ఫాదర్ అనాలి----రోణంకి అప్పలస్వామి.10. గురజాడ అసాధారణుడు, నవ్యాంధ్రకవిత్వమునకు శ్రీకారం చుట్టినఆదికవి--- ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి.  అంతేకాదు ఆనాటినుండి ఈనాటి వరకూ ఎందరో సాహిత్యవేత్తలు, పండితులుతమ తమ విలువైన అభిప్రాయాలను గురజాడపై వ్యక్తపర
చారు. ఇవన్నీ ' మూడు యాభయిల అడుగుజాడ'  అనే గ్రంథం నుండి సేకరింపబడిన సమాచారమే !  ఇక   ఆ గ్రంథంలో గల గురజాడ సూక్తులను కూడా చూద్దాం. గురజాడ వ్రాసిన ' దేశభక్తి' గేయాలలో కొన్నింటిని అనగా" దేశమును ప్రేమించుమన్నా......;  " పాడిపంటలు పొంగిపొర్లే...... " స్వంత లాభం కొంత మానుకు....." దేశమనియెడిదొడ్డ వృక్షం......" అనే గేయాలను ఈ గ్రంథంలో గురజాడ సూక్తులుగా ఇవ్వబడ్డాయి. ఇవిగాక  రేపు మరికొన్ని గురజాడ  సూక్తులను తెలుసుకుందాం. ( సశేషం )
  .