ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురజాడ ' కొండుభట్టీయం', బిల్హణీయం రచనలను అసంపూర్తిగా నిలిపేసాడనీ కొంతమంది రచయితల గ్రంథా లను చదివితే తెలు స్తోంది. అలా నేను చదివిన గ్రంథాలలో యు.ఎ. నరసింహమూర్తిగారి 'కన్యాశుల్కం 19వ శతాబ్ది ఆధునిక భారతీయ నాటకాలు' అనే గ్రంథంలో " కొండు భట్టీయం- బిల్హణీయాలను ప్రారంభించిన గురజాడ తన అభిరుచికి తగని ఆటంకాలు ఎన్నోఎదురయ్యాయి.అందుకే ఆనాటకాలను పూర్తి చేయలేదు. అసలు గురజాడకు కల్పనా శక్తి తక్కువ. అతనినాటకాలన్నిటికీ సామగ్రి ఒక్కటే అనవలసి వస్తుంది. .............కన్యాశుల్కంతో ఆయన సరుకంతా ఖర్చైపోయింది. వాడుక భాష--- సంఘసంస్కారం ఆయన సామగ్రి---సంచికట్టు, వేశ్యల పట్ల , విధవలపట్ల అతని కారుణ్యం అపారమైనది. అలవిగానిది. వాటి విశ్వరూపాన్ని కన్యాశుల్కంలో చూపించాడు. ఇక ఎంత రాసినా దానినే ఇంకో రూపంలో రాయడం జరుగుతుంది. అందుకే మిగిలిన నాటకాలు అసంపూర్ణంగా మిగిలి పోయాయి. " అంటారు. " అభూత కల్పనా గాథకు ఇతివృత్తం'' కూడా పాట రూపంలో ఉన్న ఈనాటిక గురజాడ అసంపూర్ణంగా మిగిలిన రచన. గురజాడ రచనల సంపుటా ల్లో వేటిలోనూ దీనిని చే‌ర్చటం జరగలేదు. " అని సెట్టి. ఈశ్వరరావుగారు సంపాదకత్వం వహించిన " గురజాడ రచనలు కవితల సంపుటం" లో చెబుతారు. అయితే మనం ఇక్కడ మనం గమనించవలసిన విిషయం ఒకటుంది. గురజాడ రచనలు కవితల సంపుటం లోనూ,తెలకపల్లి రవి సంకలనం చేసిన " దా‌ర్శనికుడు గు‌రజాడ" అన్న పుస్తకంలోనూ, " గురజాడ రచనలు"(కథానికలు ) అన్న సంపుటిలోను "బిల్హనీయం " మొదటి భాగం 1910లోనూ, 1911లో రెండవభాగమున్నూ ప్రచురింపబడ్డాయని పేర్కొన్నారు. అసంపూర్ణంగా ఉన్న నాటకాలను ప్రచురిం చారా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. 1906 లో కొండుభట్టీయం" రచన అనేసారు సెట్టి. ఈశ్వరరావు లాంటివాళ్ళు. అయితే ఆరచన సంపూర్ణమా?అసంపూర్ణమా అన్న ప్రశ్న మనలో ఉద్భవిస్తుంది. " అభూత కల్పనా గాథకుఇతివృత్తం" అనే అంశం పాట రూపంలో నున్న నాటిక అని అని సెట్టి. ఈశ్వరరావుగారు ముందుగానే తెల్చేసారు. గురజాడ రచనలపై విశ్లేషించిన రచయితలు చాలామందిఉన్నా దీని ప్రశక్తికి పోలేదు. దీనిని గురజాడ అసంపూర్ణ రచనగానే మనం భావించాలి. ( సశేషం)- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలిఫోన్ :701 3660 252.
July 31, 2020 • T. VEDANTA SURY • Memories