ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురుదేవోభవ.-- --అన్నాడి జ్యోతి M.A, T.P.T సిద్దిపేట.
September 5, 2020 • T. VEDANTA SURY • News

మాతృదేవోభవ పితృదేవోభవ
ఆచార్యదేవోభవ అతిథిదేవోభవ.
అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి విజ్ఞానాన్ని పెంపొందించే గురువులకు సహస్ర కోటి వందనాలు.  
                మొదటి గురువులు అమ్మానాన్నలు.అమ్మ ఒడినుండే ఒక్కొక్కటీ నేర్చుకోవడం ప్రారంభిస్తాం.నాన్న నడకనేర్పుతూ,తప్పటడుగులు వేస్తున్నప్పుడే తప్పుటడుగులు వేయకుండా గురుతర బాధ్యతతో తీర్చిదిద్దుతారు.
గురుర్ బ్రహ్మ:గురుర్ విష్ణు: గురుదేవో మహేశ్వరఃగురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.   
               మట్టి ముద్దలాంటి
విద్యార్థిని అనేక రకాలుగా,మట్టిలో మాణిక్యాల్లా తీర్చిదిద్దే ఘనత ఒక ఉపాధ్యాయులది మాత్రమే.ఒక ఇంజనీర్ ను,ఒక డాక్టర్,ఒక టీచర్,ఒక రాజకీయ నాయకుడు,ఒక పోలీస్ ఆఫీసర్,ఒక కలెక్టర్ ను తయారు చేసి సమాజానికి అందించే సామర్థ్యం గలవారు గురువులు.గురువులమాటలు విన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.పాఠశాలలో అడుగిడిన ఒక విద్యార్థి ఎలా తీర్చిదిద్దబడినా ఆ విద్యార్థి వెనక ఉపాధ్యాయుల ప్రభావం ఉంటుంది.కాబట్టి విద్యార్థి లో మంచి ఆలోచనలను పెంపొందిస్తూ,చెడు మార్గాన నడవకుండా, సద్గుణాలు పెంపొందిస్తూ,సచ్ఛీరులుగా తీర్చిదిద్దుతూ,మంచి విలువలతో కూడిన విద్యను అందిస్తూ,మానవతా విలువలను పెంచుతూ, సంస్కృతీ సంప్రదాయాలను నేర్పుతూ "కనిపించే దైవాలు" గురువులు.
 గొప్ప పౌరులను దేశానికి అందించే మహోన్నత మూర్తులు. సహనమూర్తులు,శాంతమూర్తులు, సహృదయులు గురువులు.గురువులారా అందుకొనుము మా వందనాలు.