ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురుభ్యో నమః----సుజాత.పి.వి.ఎల్.
September 5, 2020 • T. VEDANTA SURY • Poem

చీకటిని పారద్రోలేది
భాస్కరుడైతే..
భావాంధకారాల్ని పటాపంచలు చేసేది 
గురువు..
దేవుణ్ణ్ని సైతం దిక్సూచిలా 
చూపించేది గురువు.
ఎదిగిన ప్రతి వ్యక్తిత్వం వెనుక
దేదీప్యమాన వెలుగై ఉంటాడు గురువు..
గురువు లేని జగతి 
అగమ్యగోచరమే..అధకార బంధురమే..!
మనుష జన్మను పొందటం అదృష్టమైతే..
గురువును పూజించటం 
శిష్య జన్మ వరం..
నన్ను తీర్చిదిద్దిన ఎందరో ఉపాధ్యాయుల (గురువుల)పాద పద్మాలకు 
వినమ్ర నమస్కార 
కవితా కుసుమ సమర్పితాలు!!