ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురువు (కవిత) -రచన: వాసరవేణి శ్రీ వివేక్, 10వ.తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బండలింగంపల్లి,జిల్లా:రాజన్న సిరిసిల్ల. పిన్ 505305,సెల్:9492193437
September 6, 2020 • T. VEDANTA SURY • Poem

అమ్మ నాన్నలు ఇంట్లో దైవం
గురువేమో బడిలో దైవం
మంచి మాటలు చెబుతారు
మంచి జ్ఞానం అందిస్తారు
సలహాలు ఎన్నో అందిస్తారు సహాయమెంతో చేస్తారు
క్రమశిక్షణను నేర్పిస్తారు
క్రమంగ బడికి రమ్మంటారు
పొట్లాటలు వద్దంటారు
కలిసి ఉండాలంటారు
భయం వీడాలంటారు
ధైర్యం నూరిపోస్తారు
మార్గదర్శనం చేస్తారు
ఆదర్శంగా ఉంటారు