ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గుర్తుకొస్తున్నాయి---వంశీ రామరాజు --వంశీ బర్కిలీ ఫిలిం అవార్డ్స్ ఎన్నిక ఎప్పుడు ఒకకమిటీ తోకాకుండ ప్రజాభిప్రాయం ద్వారా జరిగేది. మాములుగా అయితే బర్కిలీ వారుపబ్లిక్ బాలెట్ వేసేవారు.దానిని అనుసరంచి ఎవరికిఎక్కువ మెజారిటీ వస్తే వారి పేర్లు ప్రకటించిఅప్పుడు కళాకారులను సంప్రదించేవాళ్ళము.వారు సంతోషించేవారు.మాకు సహకరించేవారు.వారు వంశీ బర్కిలీ అవార్డ్స్ అంటే గౌరవించేవారు.వంశీ బర్కిలీఅవార్డ్స్ లో ఉన్న విజేతలు చాలామందికినందిఅవార్డ్స్ లో అవకాశముండేది.అలాగా కూడా వంశీ బర్కిలీ అవార్డ్స్ కు గుర్తింపువచ్చింది.టికెట్స్ పెట్టేవాళ్ళంకాదు.ఎక్కువగారైలుకళారంగ్‌లో జరిగేవి.అంతమంది తమ అభిమాన నటీనటులను కళాకారులనుచూడటానికి ఎంతో ఉత్సాహంగా వచ్చేవారు.మీరు చూస్తున్న ఫోటోలు వంశీబర్కిలీ అవార్డ్స్ ను ఇనాగరేట్ చేస్తున్నవైజయంతిమాల బాలి గారు,డాక్టర్ టిసుబ్బరామిరెడ్డి గారు,ఉత్తమనటుడుశోభన్ బాబు గారు,ఉత్తమనటి విజయశాంతిగారు, డాక్టర్ తెన్నేటి సుధ,వంశీ రామరాజు ,మరొకఫోటోలో జీవితసాఫల్య పురస్కారం ఆదుకుంటున్నవైజయంతిమాల గారు.1972 నుంచి కార్యక్రమాలు నేనే చేస్తున్నఫోటోలు చూస్తుంటే నేనే చేసానాఅనిపిస్తుంది.
August 13, 2020 • T. VEDANTA SURY • Memories