ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గొంతు నొప్పి, గొంతు పుండు- నివారణ.: - పి . కమలాకర్ రావు
October 30, 2020 • T. VEDANTA SURY • health tips

గోరువెచ్చని నీటిలో త్రిఫల చూర్ణం వేసి కొద్దిగా సైంధవ లవణం కలిపి గొంతులో పోసుకుని గార్గి లింగ్ చేయాలి. కొన్ని మెంతుల్ని నీటిలో వేసి మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దికొద్దిగా పుక్కిలించాలి . రాత్రి నిద్రపోయే ముందు పాలల్లో పసుపు వేసి మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు కలకండ కలిపి త్రాగితే గొంతు నొప్పి తగ్గిపోతుంది. తమలపాకులను కడిగి ముక్కలుగా తుంచి నీటిలో వేసి అతిమధురం పొడి కలిపి మరిగించాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె కలిపి త్రాగాలి. దీనితో గొంతు పుండు, గొంతు నొప్పి తగ్గి కంఠం శ్రావ్యంగా తయారవుతుంది.