ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గొంతు లో నస , గొంతు బొంగురు - నివారణ - గొంతులోని నస బొంగురు గొంతు మానను స్పష్టం గా ధైర్యంగా మాట్లాడ నివ్వదు. గొంతులో నొప్పి వున్నప్పుడు అది మరింత అసౌకర్యంగా ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఫ్రిజ్ లో నుంచి తీసిన ఆహారాన్ని తిన కూడదు. కొన్ని లేత మామిడి ఆకులు తీసుకొని అందులో అతి మధురం ( ములేటి ) పొడి , కొద్దిగా మిరియాల పొడి వేసి నీరు పోసి మరిగించి చల్లార్చి తేనే కలిపి తాగాలి. గొంతులో నస గొంతు బొంగురు , స్ట్రెస్ కూడా తగ్గుతుంది. కొద్దిగా మిరియాల పొడిలో తేనే కలిపి నాకితే గొంతు నొప్పి, గొంతు బొంగురు తగ్గి పోతుంది. నీటిలో కొద్దిగా త్రిఫలా పొడి వేసి చిటికెడు పసుపు వేసి కొద్దిగా ఉప్పు వేసి గోరు వెచ్చగా వున్నప్పుడు గార్గిలింగ్ చేస్తే గొంతు ఫ్రీ గా అవుతుంది. - పి . కమలాకర్ రావు
June 22, 2020 • T. VEDANTA SURY • health tips