ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గౌడపాదులు..!'---సుజాత.పి.వి.ఎల్.
September 8, 2020 • T. VEDANTA SURY • Story

గౌడపాదులు శంకరాచార్యుని గురువైన గోవింద భగవత్పాదుల గురువు. అద్వైతం అనే మహాసౌధానికి తర్కంతో పునాదులు వేసిన వేదాంతి, మేధావి, తత్త్వజ్ఞడు. శంకరాచార్యులు, ఆయన శిష్యులు రచించిన పుస్తకాలలో ఈయనను గౌడాచార్యులు, గౌడపాదాచార్యులు, గౌడాచరణ, గౌడ వంటి పేర్లతో స్తుతించారు. గౌడపాదులు అద్వైతానికి వేసిన పునాదులలో ముఖ్యమైనది అజాతివాదం. అజాతివాదం అంటే "అసలు పుట్టుకే లేదు" అనడం. దీనికే అస్పర్శవాదం అని కూడా పేరు ఉంది. ఆదిలో అవ్యక్తమైనది, అంతంలో అవ్యక్తమైనది మధ్యలో కూడా అవ్యక్తమే అయ్యి ఉండాలి కనుక మన చుట్టూ ఉన్న సృష్టి అంతా మిథ్య అని గౌడపాదుల వాదన. గౌడపాదులు రచించిన మాండూక్య కారికకు శంకరాచార్యులు వ్రాసిన భాష్యం చిగురున వారు గౌడపాదులను "పరమ గురువు" అని సంబోధించారు. అంటే గురువుకు, గురువు అని అర్థం. అందుచేత ఈయన శంకరాచార్యుని కంటే రెండు తరాల ముందు, సుమారుగా 5వ శతాబ్దంలో, జీవించి ఉండి ఉండాలి. గౌడపాదుల రచనలలో ముఖ్యమైనవి మాండూక్యోపనిషత్ పైన వ్రాసిన మాండూక్య కారిక దీనికే ఆగమ శాస్త్రమని పేరు.