ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఘ‌నంగా బాలల ప్రతిభా అవార్డులు - 2020
November 14, 2020 • T. VEDANTA SURY • Talent

హైద‌రాబాద్: రోటరీ కమ్యూనిటీ కార్ప్స్ ఆఫ్ అథ్మా బాలల ప్రతిభ అవార్డుల2020  ప్ర‌దానోత్స‌వం ఘ‌నంగా  హైదరాబాద్ లో జ‌రిగింది. సుంద‌రయ్య విజ్ఞాన కేంద్రంలో  ఈ  కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. న‌వంబ‌రు 14 బాలల  దినోత్స‌వం సందర్బంగా  ప‌లు ర‌కాల పోటీలు నిర్వ‌హించారు. . ఈ పోటీల‌లో అన్ని వయసుల పిల్లల కోసం వివిధ సరదా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు . . ఈ పోటీల‌లో ప‌లువురు విద్యార్థులు వారి ప్రతిభను ప్రదర్శించారు. మీకో విషయం తెలుసా ఈ పోటీల్లో పాల్గొన్న వారు తమ ఈవెంట‌లను ఆన్‌లైన్‌లో వారి ఎంట్రీలను పంపారు. దీనిలో నర్సరీ నుండి 10 వ తరగతి వరకు దాదాపు 1500 మందికి పైగా బాలలు పాల్గొన్నారు. అంధులో పాల్గొన్న ఇద్దరి ఫోటోలను మొలకను పంపించారు అందులో ఒక తమ్ముడు డాన్సింగ్ లో..బి. సూర్య క‌ర‌ణ్ రాజ‌మ్‌-6వ త‌ర‌గ‌తి, హౌవార్డ్ టాలెంట్ స్యూల్‌,హైద‌రాబాద్‌. ఆయన చెల్లెలు .బి. ల‌క్ష్మీతేజ‌.. (రైటింగ్ ఆఫ్ ఎస్సే లో.)6వ త‌ర‌గ‌తి, హౌవార్డ్ టాలెంట్ స్యూల్‌,హైద‌రాబాద్‌ వీరితో పాటు అన్ని విభాగాల నుండి  మొత్తం 50 మందికి అవార్డులు లభించాయి.. మరి అందరిని మనం అభినందిద్దాం : మొలక