ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చందురుడిని మించిన చిత్తరువుల రారాజు : సత్యజి ప్రజా
September 30, 2020 • T. VEDANTA SURY • News

ఐదారు తరాల బాల్యం "చందమామ"తో 
చెట్టాపట్టాలు వేసుకొని నడవటానికి  _ 
ఆ పత్రికలోని అందమైన బొమ్మలూ ఒక కారణం. 
పట్టువదలని విక్రమార్కుడి బేతాళ కథలో 
భుజమ్మీద శవాన్ని వేసుకొని నడుస్తున్న బొమ్మ 
చిన్ననాటి కళ్ళల్లో ఇంకిపోయి _ 
హృదయపు తెరల్లో అలాగే అచ్చయి పోయిన గురుతులు ఎన్నో !
 అలాటి మరపురాని ఎన్నెన్నో బొమ్మల సృజనకారుడు శంకర్ 
96 ఏళ్ళ వయసులో ఈరోజు  చెన్నైలోకన్నుమూశారు! 
దాదాపు ఏడు దశాబ్దాల పాటు 
తరతరాల పిల్లలను అలరించిన బొమ్మల తాతయ్య _ 
ఇప్పుడు నింగి చందమామ ముఖమ్మీద 
బోలెడు బోలెడు బొమ్మలు గీస్తాడు కాబోలు ! 
ఆయనకు జేజేలు, జోహార్లు !!