ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చరిత్రపుటల్లో భుపాలపట్నం--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు --వాజేడు మండలంలోని తెలంగాణనయాగరా " బొగతజలపాతం" కు సుమారు 70 కి:మీ దూరంలోగల ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని " భూపాలపట్నం" పేరులో పట్నాన్ని దాచుకున్న అది ఒక చిన్న తాలూకా కేంద్రమే !!జగదల్ పూర్ వెళ్లే జాతీయ రహదారి పక్కనగల దీన్ని అంతా " పట్నం" అని పిలుచుకుంటారు,అతి సాధారణంగ అగుపించే ఈ పట్నం చరిత్ర పుటల్లో ఒక "వీరభూమి"స్వాతంత్ర ఉద్యమ కాలంలో జరిగిన 1857 సిపాయిలతిరుగుబాటుకు ఇక్కడ కూడా మద్దతులభించింది, స్థానిక జమీందారు "యాదవ రావు" ఇక్కడి నుండి బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసారు గోదావరితీర ప్రాంతంలో గిరిజన సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటీష్ పాలకులపై దాడులు చేసారు , చివరికి బ్రిటీష్ పాలకులు "సంధి" పేరుతో యాదవరావు ను రప్పించి దొంగచాటుగా బంధించి అంతం చేసారు, అయిన పట్నం తిరుగుబాటు ఆగలేదు అతని ప్రధాన అనుచరులు బాబురావు, వైకుంఠరావు,ల నేతృత్వంలో తిరుగుబాటు చాలాకాలం కొనసాగింది, 1859 ఏప్రియల్ 29న వీరినాయకత్వంలో ఇద్దరు తెల్లదొరలు హతమయ్యారు, దానికి ప్రతీకగా చాలా కాలానికి వైకుంఠరావు ను అరెష్టు చేసి అండమాన్ లోని "కాలపాని"జైల్లోజీవితఖైదీనిచేసారు, ఇలా భూపాలపట్నం స్వాతంత్రోద్యమంలో స్థానం సాధించింది,అనంతరం నైజాంలపాలనలో కూడా ఈ ప్రాంతం పాలించబడినట్లు సాక్ష్యంగా నేటికి కొన్ని నాటికాలపు కట్టడాలు విశ్రాంతిభవనాలుగా దర్శనమిస్తున్నాయి ,ఇంద్రావతినది గోదావరి లో సంగమించె సుందర ప్రాంతమే గాక అద్భుతమైన అడవులకు అటవీఉత్పత్తులకు కలపకు నిలయమైన ఈ ప్రాంతంలో అచ్చమైన స్వచ్ఛమైన గిరజనులు అధికంగా నివసిస్తున్నారు,1990 సం: వరకు " పట్నం" సమీపం లోని "రుద్రారం"గుట్టల్లో " రంగురాళ్ల ఘని వుండి ఈ ప్రాంతం అనధికారికంగా సిరిసంపదలతొ తులతూగింది, ప్రస్తుతం ఈ ఘని నిర్వీర్యం చేయబడి నిశ్శబ్దవాతావరణం నెలకొంది,గోదావరి ఆవల మహారాష్ట్ర భూభాగం "సిరొంచ" తోను తెలంగాణరాష్ట్ర భూభాగం " కాళేశ్వరం" తోను సత్ సంబంధాలుగల "భూపాలపట్నం" ఒక మద్యతరహవ్యాపారకేంద్రం.
August 13, 2020 • T. VEDANTA SURY • Memories