ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చాచా నెహ్రూ: --కే స్వాప్నిక్ సింధూర్
November 20, 2020 • T. VEDANTA SURY • Story

జవహర్లాల్ నెహ్రూ 1889 వ సంవత్సరం నవంబర్ 14వ తేదీన అలహాబాదులో జన్మించారు ఈయన తల్లిదండ్రులు మోతిలాల్ నెహ్రూ స్వరూప రాణి మోతిలాల్ పేరు పొందిన న్యాయవాది కాక స్వాతంత్ర్య అభిలాషి కూడా కావడం వలన నెహ్రూకు స్వాతంత్ర్యం వాంఛ కలిగింది జవహర్ అంటే రత్నము అని అర్థం నెహ్రూ తన పేరు సార్థకం అయ్యే విధంగా తన కుటుంబమునకు దేశమునకు మాత్రమే కాక ప్రపంచానికంతటికీ రత్నమై వెలిగిన డు చాలా కాలం తర్వాత ఆయన ఒక సోదరి జన్మించింది ఆమె ఏ విజయలక్ష్మి పండిట్ అలహాబాద్ లోని శిల్ప కళా శోభితమైన ఆనంద భవనం నివాసగృహం.
              ఆగర్భ శ్రీమంతుడైన జవహర్ ఉ బాల్యమున ఆనంద భవనం లోనే విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు బాల్యంలో ఈత కొట్టడం వ్యాయామం చేయటం గుర్రపు స్వారీ చేయడం సాముగరిడీలు నేర్చుకోవడం జవహర్ నిత్యకృత్యాలు వీరి ఇంట్లో పనిచేసే ముబారక్ అలీజవహర్ ఉక్కు అరేబియన్ నైట్స్ కథలను ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామ కథలను చెప్పేవాడు తల్లి ఒడిలో పడుకొని రామాయణ-భారత వినేవాడు  ఫెర్డినాండ్ బ్రిక్స్ వద్ద ఆంగ్లము నేర్చుకున్నాడు నెహ్రూకు విజ్ఞాన శాస్త్ర విషయములందు కూడా ఆయన ఆసక్తి కలిగించాడు. జవహర్ బాల్యమున ఒకసారి వేటకు అడవికి వెళ్ళి తన తుపాకీతో ఒక కృష్ణ సారంగము చంపాడు దాని మరణ వేదన కనులారా చూచి బాధపడి అప్పటినుండి అప్పటినుండి వేటకు స్వస్తి చెప్పాను.
              జవహర్లాల్ లండన్లోని ఆరో పబ్లిక్ స్కూల్లో చదువు పూర్తి చేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో కళాశాలలో రసాయన వృక్ష భూగర్భ శాస్త్రములను అభిమాన విద్యలుగా తీసుకుని చదివాడు దీనికి తోడు చరిత్ర రాజకీయాలు ఆర్థికశాస్త్రం సాహిత్యంలోనూ కూడా చదువుతుండేవాడు 1912లో చదువు పూర్తి చేసుకుని ఇంగ్లాండు నుండి తిరిగి వచ్చాడు తర్వాత ఉత్తర ప్రదేశ్ హైకోర్టులో న్యాయవాద వృత్తి చేపట్టాడు.
                1916లో జవహర్ కమలాదేవి ని వివాహం చేసుకున్నాడు ఆ దంపతులకు 1917లో ఒక కుమార్తె జన్మించింది ఆమె ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ 1916లో అనిబిసెంట్ గారు స్థాపించిన హోమ్రూల్ లీగ్ లో చేరాడు అదే సంవత్సరం బాలగంగాధర్ తిలక్ మహాత్మా గాంధీ గారితో పరిచయం జరిగింది వారి స్ఫూర్తితో స్వాతంత్ర్య సమరంలో చురుకుగా పాల్గొన్నాడు ఫలితంగా ఆయన తొమ్మిది సంవత్సరాల జైలు జీవితం గడపాల్సి వచ్చింది ఆయన జైలులో ఉన్న సమయం వృధా చేయక ఎన్నో గ్రంథాలను రచించాడు అనేక లేఖలను వ్రాసేవాడు 1929 లో మొదటిసారిగా నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమింపబడిన సహాయ నిరాకరణ ఉద్యమం మరియు క్విట్ ఇండియా ఉద్యమం రెండింటిలోనూ నెహ్రూ ప్రముఖ పాత్ర వహించాడు.
               1947 ఆగస్టు 15వ తేదీన భారత దేశము స్వాతంత్రం పొందింది స్వతంత్ర భారతానికి ప్రధమ ప్రధాని అయిన జవహర్లాల్ దేశ అభివృద్ధికి ఎనలేని కృషి చేశాడు శాంతిదూతగా తృతీయ ప్రపంచ యుద్ధం రాకుండా చేశాడు తను ప్రవేశపెట్టిన పంచశీల సూత్రాలు ద్వారా ప్రపంచ ఖ్యాతి గడించాడు భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న బిరుదునిచ్చి సత్కరించింది భారతదేశమునకు ప్రపంచంలో గౌరవ ప్రతిష్టలను ఇనుమడింప చేసిన మహనీయుడు జవహర్లాల్ నెహ్రూ 1964 మే 27వ తేదీన తుదిశ్వాస విడిచాడు నెహ్రూ గారికి పిల్లలు గులాబీ పువ్వులను పావురాలను ఎంతో ఇష్టం అందుకే పిల్లలు వీరిని చాచానెహ్రూ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు వీరి పుట్టినరోజు నవంబర్ 14వ తేదీన దేశమంతా బాలల దినోత్సవం గా జరుపుకుంటారు.