ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చాలా గ్రామాల్లో ప్రజలు తమ గ్రామంలో గల పాఠశాలల అభివృద్ధికి కృషి చేయరుసరికదా ఉన్న పాఠశాలను తగలబెట్టే ప్రయత్నం చేస్తారు. స్లాబ్డ బిల్డింగ్ అయితే పాఠశాలకు శెలవులు అయిన ప్పుడు లేక పాఠశాల పనివేళలు ముగిసిన అనంతరం కిటికీ లు,ద్వారబందాలుతొలగించి లోపల పేకాట, త్రాగుడు,వ్యభిచారాలకు పాఠశాల ను ఉపయోగించడం, గదుల్లో వంటచెరకు ( కట్టెలు) పెట్టడం, పాఠశాల వరండాల్లో పశువులు కట్టడం, వాటి రొచ్చులు, పేడల వలన దుర్గంధ పూరిత వాతావరణం ఏర్పడటంతో విద్యార్థుల ఆరోగ్యందెబ్బతినడం జరుగుతుంది. గదుల్లో వంటచెరకు ( కట్టెలు) పెడతారు. పాఠశాలల్లో విద్యార్థుల త్రాగునీటి సదుపాయానికి వేసిన బోరింగ్ లు పారాయివాళ్ళపాలు అవుతున్నాయి. బోరింగ్ దగ్గరే ఎంగిలి పాత్రలు (అంట్లు)తోమడం వంటి పనులు చేసి అపరిశుభ్రత కలుగజేయడం వారి నైజం. అలానే పాఠశాల గ్రౌండ్ లో జనపనార, ధాన్యం,వేరుశనగ కాయలు వంటి పంటలు ఎండ బెట్టడం వంటి కార్యక్రమాలను ప్రధానోపాధ్యా యుడు,ఇతర ఉపాధ్యా యులు మూకుమ్మడిగా అడగాలి. ఒక్క ప్రధానో పాధ్యాయుడే అడగాలి, మనకేం సంబంధం అనే ధోరణి మిగిలిన ఉపాధ్యాయులలో ఉండకూడదు. ఈ పాఠశాల ‌మనది అనే ఐక్యతా భావం అందరిలో ఉండాలి. పాఠశాలకు సంబంధిత సమస్య ఏదైనా మన అందరికీ సంబంధించినదిగా భావించాలి. ఊరిలో నాయకులతోను, అధికారులతోను ఇటువంటి కార్యక్రమాలపై చర్చించి పాఠశాల వాతావరణం ప్రశాంతంగా ఉన్నట్లు చూడాలి. మన వైఖరి ఎవరు ఎలా పోతే మనకెందుకులే అన్నట్టు ఉండ కూడదు. పాఠశాలను గానీ, పాఠశాల స్థలాన్ని గానీ ఏ ప్రబుద్ధుడు ఆక్రమించినా ఆ ఊరు సర్పంచ్ కు గానీ, ఉన్నతాధికారులకు గానీ వెంటనే సమాచారాన్ని అందించి అటువంటి వారిని అరికట్టాలి. నేను పక్కి, సీతానగరం హైస్కూలల్లో వెళ్లిన కొత్తలో శలవు రోజుల్లో అయితే నన్ను అడక్కుండానే శుభకార్యాలు, అశుభ కార్యాలకు సంబంధించిన వంటావార్పు, భోజన కార్యక్రమాలు స్కూలులోనే జరిపించడం, అక్కడే గంజి పారవేయడం, విస్తరాకులు పాఠశాల పరిసర ప్రాంతంలోనే చెల్లాచెదురుగా విసరేయడంజరిగేది. రెండు, మూడు రోజులయ్యేసరికి మురుగు కంపు, ఆకులు కుళ్ళి దుర్గంధంతో కూడు కున్న కంపు ఉండేది. నైట్ వాచర్ కు కాషన్ ఇచ్చాను. నైట్ వాచర్ ఉండీ ఈస్కూల్ కు ఈగతి పట్టిస్తున్నావంటే సిగ్గుచేటు. ఇకనుండి ఇలా జరిగిందంటే నైట్ వాచర్ పోష్టు ఈ స్కూలుకు అవసరం లేదని జిల్లాపరిషత్ కు వ్రాసేస్తాని చెప్పాను. ఆ రోజు నుండి ఇటువంటి కార్యక్రమాలు సీతానగరం పాఠశాలలో జరగలేదు. ( సశేషం ) -శివ్వాం. ప్రభాకరం,బొబ్బిలి,ఫోన్ : 701 3660 252.
June 25, 2020 • T. VEDANTA SURY • Memories