ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చింతోజు బ్రహ్మయ్య - బాలమణి బాల సాహిత్య పురస్కారాలు
August 21, 2020 • T. VEDANTA SURY • News

డా! బ్రహ్మయ్య మెమోరియల్ పీపుల్స్ హాస్పిటల్స్ , ముస్తాబాద్ ఆద్వర్యంలో 2017, 18, 19 చింతోజు బ్రహ్మయ్య - బాలమణి బాల సాహిత్య పురస్కారాలకు సిద్దిపేట జిల్లా నుంచి బడిపిల్లలు రాసిన రచనలు 2017కి గాను గుళ్ళపల్లి కాంతికృష్ణ సంపాదకత్వంలో వచ్చిన కాంతి కిరణాలు (ZPHS నర్సాయపల్లి, మద్దూర్), జెగ్గారి నిర్మల సంపాదకత్వంలో వచ్చిన లలిత పల్లవాలు (బాలికల పాఠశాల కొండపాక) 2019కి గాను ఉండ్రాళ్ళ తిరుపతి సంపాదకత్వంలో వచ్చిన బి.కొండాపూర్ కోకిలలు (UPS బి.కొండాపూర్, దుబ్బాక నియోజకవర్గం) బైథి దుర్గయ్య సంపాదకత్వంలో వచ్చిన జక్కాపూర్ బడిపిల్లల కథలు (ZPHS జక్కాపూర్, నారాయణరావుపేట) బాల సాహితీవేత్త ఉండాళ్ళ రాజేశం సంపాదకీయంలో వచ్చిన అక్షర కాంతులు (సిద్దిపేట జిల్లా 42 పాఠశాల విద్యార్థుల రచనలు)  చింతోజు బ్రహ్మయ్య - బాలమణి బాల చైతన్య  పురస్కారానికి గాను పిట్లకావ్య రచించిన కావ్యమాల శతకం (ZPHS చిన్నకోడూర్) ఎంపికైనట్లు అద్యక్షులు డా!చింతోజు శంకర్, డా! రాజారాం, నారాయణ, కార్యదర్శి గరిపల్లి అశోక్ బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం తెలిపారు. బాలసాహిత్యంలో ముందుకు సాగుతున్న సిద్దిపేట బడి పిల్లల రచనలు పుస్తకరూపంలో అందించినందుకు గాను చింతోజు బాల సాహిత్య పురస్కారాలుగా నగదు, ప్రశంసా పత్రం, మెమెంటోలు త్వరలోనే అందజేయడం జరుగుతుందని అన్నారు.