ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చిగుళ్ల వాపు - నివారణ - పి . కమలాకర్ రావు
September 14, 2020 • T. VEDANTA SURY • health tips

కొందరికి పంటి చిగుళ్లు ఉబ్బి. అప్పుడప్పుడు ఏదైనా గట్టి పదార్థాలు నమలడానికి ఇబ్బంది పడుతుంటారు . దీనిని ప్రారంభ దశలో పట్టించుకోక పోతే చాలా అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. తేలికైన మన చుట్టూ కనిపించే కొన్ని ఆకులతో ఈ సమసిను తగ్గించుకోవచ్చు. కొన్ని జామ ఆకులు కడిగి త్రుంచి నీళ్లలో మరిగించి చల్లారిన కషాయాన్ని పుక్కిలిస్తే చిగుళ్ల వాపు తగ్గిపోతుంది. నేరేడు ఆకులు ఇదే విధంగా కాచి కాషాయం చేసి పుక్కిలిస్తే మెత్తబడిన చిగుళ్లు గట్టి పడతాయి. నొప్పి కూడా తగ్గి పోతుంది. ఆ తర్వాత మామిడి ఆకులు కొన్ని కాషాయం చేసి పుక్కిలిస్తే ఛుగుళ్ల వాపు , నొప్పి తగ్గి పోతుంది. ఒక వేళ నోటి పూత ఉన్నా. కూడా పూర్తిగా తగ్గి పోతుంది. ఆ తర్వాత కరక్కాయ పొడితో చిగుళ్లపై రుద్దితే పూర్తిగా చిగుళ్ల వాపు తగ్గి పోతుంది.