ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు: బిందు మాధవి , ఎం
November 14, 2020 • T. VEDANTA SURY • Story

"చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదువ కాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత
విశ్వదాభిరామ వినుర వేమ"

ఏ ప్రయోజనం ఆశించకుండా, నిర్మలమైన మనసుతో చేసిన పుణ్యం.... అది కొంచెమైనా ఫలితం మెండుగా ఉంటుంది.

అదెలాగంటే .... ఎంతో చిన్న విత్తనం గల మర్రి వృక్షం ఎంతో పెద్దగా ఎదిగి, ఎంతో దూరం విస్తరించుకుంటుంది కదా. మీకు తెలుసా మర్రి విత్తనం ఎంత చిన్నగా ఉంటుందో?

మరి ఈ విషయాన్నే ఓ కధ లాగా తెలుసుకుందామా?

*********

పట్టాభిరామయ్య గారు వరండా లో కూర్చుని వార్తా పత్రిక చదువు కుంటున్నారు.
భార్య జానకి వంటింట్లో కాఫీ కలుపుతున్నది.
కొడుకు అప్పుడే నిద్ర లేచి దంత ధావన కార్యక్రమంలో ఉన్నాడు.

ఇంతలో, వారి పనిమనిషి పరుగు పరుగున వచ్చి రొప్పుతూ 'అయ్యగారూ, సందు చివర యాక్సిడెంట్ అయ్యిందయ్యా. ఆయన మన పక్క ఫ్లాట్ సారు అని గుర్తు పట్టాను. నెత్తురు ముద్ద గా రోడ్డు మీద పడి ఉన్నారు సార్. మీకు చెబుదామని పరుగెత్తుకొచ్చాను' అని గుండెలు బాదుకుంటూ చెప్పింది.

'ఏమిటే నువ్వు చెప్పేది నిజమేనా?'
'ఏమిటా కంగారు?'
'పద వస్తున్నా' అంటూ పట్టాభిరామయ్య గారు లోపలికెళ్ళి చొక్కా వేసుకుని, చెప్పులేసుకుంటూ ఉండగా భార్య కాఫీ పట్టుకొచ్చి

'ఏమిటండీ అంతా ఏదో కంగారుగా ఉన్నారు. 'ఏం జరిగింది?'
అని ఆ గ్లాస్ తో సహా వరండాలోకొచ్చింది.

అప్పుడు పనిమనిషి లక్షుమమ్మ, యజమాని జానకమ్మ గారితో జరిగిందంతా పూస గుచ్చినట్లు చెప్పటం మొదలు పెట్టింది. 'అమ్మగారూ, నేను సందు చివర చాయి తాగటానికి ఇరానీ హోటల్ కెళ్ళాను. హోటల్ ముందు ఒక ఇసక లారీ ఆపి ఉన్నది. అవతలిపక్క నించి అప్పుడే ఒక లారీ చాలా జోరుగా వచ్చింది.'

'ఎవరో ఒక సారు స్కూటర్ మీద రోడ్దు దాటుతున్నారు. ఆ సారుకి, రోడ్డుకి ఇవతల లారీ అడ్డం ఉండటం వల్ల అవతలి వైపు నించీ వచ్చే లారీ కనపడలేదమ్మా. ఆయన ముందుకెళ్ళారు. లారీ గుద్దేసింది. అందరు గుమిగూడి చూస్తుంటే నేను కూడా వెళ్ళి చూశాను. మన కాంప్లెక్స్ సారు అని గుర్తు పట్టి, అయ్యగారికి చెప్పటానికి పరుగెత్తుకొచ్చాను' అన్నది.

జానకమ్మగారు లోపలికెళ్ళి కొడుకుని లాక్కొచ్చి, 'ఒరేయి బాబూ, పక్కింటి అంకుల్ కి యాక్సిడెంట్ అయిందిట, మీ నాన్నగారు కంగారుగా వెళ్ళారు. నువ్వు కూడా వెళ్ళి ఓ సారి చూసిరా' అని చెప్పి పంపింది.

యాక్సిడెంట్ అయిన ప్రకాశ రావు ఆ లొకాలిటీ లో ఉన్న బ్యాంక్ లో పని చేస్తాడు. బ్యాంక్ పని మీద వచ్చిన వాళ్ళందరిని ఎంతో అప్యాయంగా పలకరిస్తూ అందరి పనులు ఓపికగా చేసి పెట్టేవాడు. బ్యాంక్ టైం అయిపోయినా కాషియర్ తో, మేనేజర్ తో మాట్లాడి ఎక్స్ట్రా సర్వీస్ కూడా చేసి డబ్బు ఇప్పించేవాడు. ఆ రోజుల్లో "ATM" లు, "online banking" లు లేవు. డబ్బు తీసుకోవాలన్నా, వెయ్యాలన్నా, బ్యాంక్ కి వచ్చి తీరాల్సిందే.

అటువంటి పరిస్థితిలో ఆ కాలనీ వారికి ప్రకాశ రావు చేసే ఉపకారం ఎంతో ఉన్నతంగా ఉండేది.

అందువల్ల యాక్సిడెంట్ అవ్వగానే ఆయన్ని గుర్తుపట్టి అందరు గుమి కూడి, వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళి, కౌంటర్లో అవసరమైన డబ్బు కట్టేసి, డాక్టర్ తో మాట్లాడి అవసరమనగానే బ్లడ్ కూడా ఇచ్చి అక్కడే కూర్చుని, దేవుళ్ళకి దణ్ణాలు పెట్టటం మొదలు పెట్టారు.

పట్టాభిరామయ్య గారు రోడ్డు మీదికి వెళ్ళేటప్పటికే, ప్రకాశ రావు గారిని హాస్పిటల్ కి తీసుకెళ్ళిపోయారు.

ఏ హాస్పిటలో కనుక్కుని ఆయన అక్కడికి వెళ్ళేసరికి డాక్టర్ గారు EMERGENCY MEDICAL CARE UNIT నించి బయటికొచ్చి, 'సరైన టైం కి తీసుకొచ్చారండీ. కొంచెం ఆలశ్యమైనా ప్రాణాలు దక్కేవి కాదండీ' అని చెప్పేసరికి, అక్కడ వేచి ఉన్న కాలనీ వాళ్ళందరూ -'హమ్మయ్యా దేవుడున్నాడండీ. ఆ సార్ మాకందరికీ బ్యాంకులో ఎంతో సేవ చేసే వారండీ. అలాంటి వారికి దేవుడు ఆపద రానివ్వడండీ అని గుండెల నిండా గాలి పీల్చుకున్నారు.

పట్టాభిరామయ్య గారు ఇంటికొచ్చేటప్పటికి జానకమ్మ గారు ప్రకాశరావు గురించి ఏం కబురు పట్టుకొస్తారో అని వాకిలి వైపు చూస్తూ

"చిత్తశుద్ధి కలిగి .......... పద్యంమననం చేస్తూ కాలుగాలినపిల్లిలా తిరగసాగారు.

"చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదువ కాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత
విశ్వదాభిరామ వినుర వేమ"

ఏ ప్రయోజనం ఆశించకుండా, నిర్మలమైన మనసుతో చేసిన పుణ్యం.... అది కొంచెమైనా ఫలితం మెండుగా ఉంటుంది.

అదెలాగంటే .... ఎంతో చిన్న విత్తనం గల మర్రి వృక్షం ఎంతో పెద్దగా ఎదిగి, ఎంతో దూరం విస్తరించుకుంటుంది కదా. మీకు తెలుసా మర్రి విత్తనం ఎంత చిన్నగా ఉంటుందో?

మరి ఈ విషయాన్నే ఓ కధ లాగా తెలుసుకుందామా?

*********

పట్టాభిరామయ్య గారు వరండా లో కూర్చుని వార్తా పత్రిక చదువు కుంటున్నారు.
భార్య జానకి వంటింట్లో కాఫీ కలుపుతున్నది.
కొడుకు అప్పుడే నిద్ర లేచి దంత ధావన కార్యక్రమంలో ఉన్నాడు.

ఇంతలో, వారి పనిమనిషి పరుగు పరుగున వచ్చి రొప్పుతూ 'అయ్యగారూ, సందు చివర యాక్సిడెంట్ అయ్యిందయ్యా. ఆయన మన పక్క ఫ్లాట్ సారు అని గుర్తు పట్టాను. నెత్తురు ముద్ద గా రోడ్డు మీద పడి ఉన్నారు సార్. మీకు చెబుదామని పరుగెత్తుకొచ్చాను' అని గుండెలు బాదుకుంటూ చెప్పింది.

'ఏమిటే నువ్వు చెప్పేది నిజమేనా?'
'ఏమిటా కంగారు?'
'పద వస్తున్న' అంటూ పట్టాభిరామయ్య గారు లోపలికెళ్ళి చొక్కా వేసుకుని, చెప్పులేసుకుంటూ ఉండగా భార్య కాఫీ పట్టుకొచ్చి

పట్టాభిరామయ్య గారు ఇంటికొచ్చేటప్పటికి జానకమ్మ గారు ప్రకాశరావు గురించి ఏం కబురు పట్టుకొస్తారో అని వాకిలి వైపు చూస్తూ మనవరాలితో
"చిత్తశుద్ధి కలిగి .......... పద్యం భట్టీయం వేయిస్తున్నారు.
ఆ పిల్ల, బామ్మా ఈ పద్యానికి అర్ధం ఏమిటి అని అడిగితే ఆ రోజు జరిగిన సంఘటన, ప్రకాశరావు ప్రమాదం నించి బయట పడటం అంతా వివరించి
ఆ పద్యానికి అర్ధం ఇదేనమ్మా అని హాయిగా గాలి పీల్చుకున్నారు.