ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చిత్రాంగి.బేతాళకథ -- డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై : -.పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు చేరి బేతాళుని బంధించి భుజాన వేసుకుని మౌనంగా బయలు దేరాడు. భుజంపైనున్న శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుడు 'విక్రమార్క మహరాజా నీపట్టుదల,కార్యదీక్షత,మెచ్చదగినవే,నీవీరత్వము అంటే అర్ధ,అవిద్యాస్త్ర,ఇంద్రచక్ర,కాలచక్ర,క్రాంచాస్త్ర,గరుడాస్త్ర, గంధర్వాస్త్ర,త్వష్ట్ర, తామస,దండచక్ర,ధర్మచక్ర,ధర్మపాశ,నాగాస్త్ర,నందనాస్త్ర,ప్రశమున,ప్రస్వాపన,పికాభాస్త్ర,బ్రహ్మశీర్ష,మదన,మానస,మాయ,మోదకి,మౌసల,వరుణపాశ,వర్షణం,వానవాస్త్ర,వామన,వాయివ్య,విద్యాస్త్ర,విలాపన,శిఖరి,శిఖశాస్త్ర,శీవేషిక,శుష్క,శూలపట,శోషణం,సత్య,సౌర,సోమాస్త్ర,సంతాపన,సంవర్త, సంహార,హయశీర్ష వంటి సంహార ఆయుధాలు కలిగి ఉన్న నీకు మన ప్రయాణంలో అలసట తెలియకుండా చిత్రాంగి కథ చెపుతాను విను... అమరావతి రాజ్యాన్ని వంశకేతుడు అనేరాజు పరిపాలిస్తుండేవాడు. అదేరాజ్యంలో సమ్మెట అనే గ్రామంలోని కాళీమాత ఆలయంలో దేవి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆఉత్సవాలను చూడటానికి ఎన్నో గ్రామాలప్రజలు వేలాదిగా వచ్చారు. అలావచ్చిన వారిలో సత్యవంతుడు అనే యువకుడు చిత్రాంగి అనే యువతిని చూసి ఎలాగైనా ఆమెను వివాహంచేసుకోవాలని,కాళికాదేవికృపతో వివాహం జరిగితే తన తలను దేవికి కానుకగా ఇచ్చుకుంటానని కాళీమాతకు మొక్కుకున్నాడు. చిత్రాంగి వివరాలు సేకరించి ఊరుచేరాడు.అలా ఊరుచేరి తనతల్లి తండ్రిని చిత్రాంగి వాళ్ళయింటికి వివాహ విషయం మాట్లాడటానికి పంపించాడు.ఇరువర్గాలు సమ్మతించడంతో చిత్రాంగి, సత్యవంతుల వివాహం ఘనంగా జరిగింది.కొంతకాలం అత్తవారింట కొంతకాలం గడిపిన సత్యవంతుడు భార్యతో స్వగ్రామానికి వచ్చేసాడు. సంక్రాంతి పండుగకు తనచెల్లిని,బావని ఊరుతీసుకువెళ్ళ డానికి చిత్రాంగి అన్న రామభధ్రుడు వచ్చాడు.మరుదినం ముగ్గురుకలసి బయలుదేరారు. కొంతదూరం ప్రయాణం చేసాక సమ్మట గ్రామం వద్ద కాళీమాత ఆలయం వద్దకు చేరారు.ఎండవేడికి అలసిన చిత్రాంగి ఆలయంలో కొద్ది సేపు విశ్రాంతికి ఆగుదాం అంది ముగ్గురు ఆలయం వెలుపల విశ్రమించారు.కొంతసమయం గడిచాక రామభధ్రుడు మంచినీళ్ళు తేవడానికి వెళ్లగా,సత్యవంతునికి అమ్మవారికి తన మొక్కు ఉన్న విషయం గుర్తుకు రావడం తో వెంటనే గుడిలోనికి వెళ్లి కాళీమాతకు తన తల సమర్పించాడు. బావను వెదుకుతూ గుడిలోనికి వచ్చిన రామభధ్రుడు సత్యవంతుని చూసి చూసి, ఆవిషయం తనచెల్లెలు చిత్రాంగికి ఆవిషయం చెప్పలేక తను తల తీసుకుని మరణించాడు. ఎంతసేపైనా అన్నా,భర్త రాకపోవడంతో గుడి లోనికి వెళ్లి అన్నా,భర్త మరణించి ఉండటం చూసి దుఖఃస్తు తనుబ్రతికి ప్రయోజనం లేదని తలచి అక్కడ ఉన్న కత్తితో ఆత్మహత్య చేసుకోబోయింది.అప్పుడు కాళీమాత ప్రత్యక్షమై 'చిత్రాంగి ఆగు నీసాహసం గొప్పది. నీభర్త,అన్నాశిరస్సులు వారివి వారికి జతపరుచు వారు సజీవులు అవుతారు'అనిచెప్పి అదృశ్యమైయింది.గుడిలో వెలుతురు బాగా తక్కువగా ఉండటంతో చిత్రాంగి భర్త శరీరానికి అన్నరామభధ్రుని శిరస్సును, అన్న శరీరానికి భర్త శిరస్సును జతచేసింది. వారు ఇరువురు సజీవులైనారు.అలా తలలు మారిన వారిని చూసి చిత్రాంగి ఎంతో విచారించింది.అప్పటి వరకు కథ చెపుతున్న బేతాళుడు'విక్రమార్కమహరాజా ఇప్పుడు చిత్రాంగి భర్త ఎవరు?సమాధానం తెలిసి చెప్పక పోయావో తలపగిలి మరణిస్తావు'అన్నాడు బేతాళుడు.'బేతాళా శరీరానికి గుర్తింపును ఇచ్చేది శిరస్సు వారి ఇరువురిలో చిత్రాంగిని చూసి భార్యగా భావిస్తాడో అతడే ఆమెభర్త'అన్నడు విక్రమార్కుడు. విక్రమార్కునికి మౌనభంగం కావడంతో బేతాళుడు శవంతోసహ మాయం అయ్యడు.పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళునికై వెనుతిరిగాడు.
July 31, 2020 • T. VEDANTA SURY • Story