ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చిన్నతనంలో వాళ్ళంటే భయం--పాపం, వాళ్ళ మానాన వాళ్ళు పోతున్నా చిన్నప్పుడు వాళ్ళంటే భయమేసేది. ఇంతకీ ఎవరు వాళ్ళంటే నరిక్కురవర్గళ్. వీళ్ళనే కురువిక్కారన్ అని కూడా అంటారు. మద్రాసులో స్కూలుకి వెళ్ళొస్తున్నప్పుడో బజారుకి వెళ్ళొస్తున్నప్పుడో తరచూ కనిపించేవాళ్ళు. పెళ్ళిళ్ళు జరిగే చోట వాకిట్లోనూ చూసేవాడిని.పేదరికంతోనూ, కొన్ని మతాల మాటలతోనూ, ప్రభుత్వ రాయితీలు వంటి కారణాలతో చరిత్ర పుస్తకంలో వీరు కనిపించకుండా పోయారు. నిన్న రాత్రి యు ట్యూబ్ లో ఒక తమిళ కథ విన్నాను. ఈ కురువిక్కారన్లకు సంబంధించిన కథ అది. అది వినడంతో మనసు వొరిపై మళ్ళింది. మద్రాసులో నా చిన్నతనంలో వీళ్ళను చూడటంతోనే పెద్దవాళ్ళెవరైనా కినిపిస్తే వారి పక్కకువెళ్ళడం వంటివన్నీ గుర్తుకొచ్చాయి. తమిళనాడులో ఈ తెగవారు అనేక ఊళ్ళల్లో ఉండేవారు. వీళ్ళల్లో అధికశాతం మంది ఒకచోటంటూ ఉండక సంచారం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఒకేచోట జీవించడం బహు అరుదు.బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జనసమ్మర్దం ఎక్కువగా ఉండే చోట్లలో వీళ్ళు సూదులు వంటి చిన్న చిన్న వస్తువులు అమ్ముతూ కనిపిస్తుండేవాళ్ళు.వీళ్ళకు సిద్ధ ఔషధం, ప్రకృతి వైద్యం గురించి అంతో ఇంతో పరిజ్ఞానముండేది.నాడి పట్టుకుని జబ్బేమిటో చెప్పేవారు.అయితే ఆధునిక వైద్యం వేళ్ళూనడంతో వీరి మాటలపై నమ్మకం తగ్గింది. లేనిపోని అపోహలు పెంచుకుని దూరంగా ఉంచడం మొదలుపెట్టిందీ సమాజం. వీరిలో కొందరు భవిష్యత్తు గురించికూడా చెప్పేవారు.కురువిక్కారన్ తెగవారు మహారాష్ట్ర నుంచి తమిళనాడుకు వచ్చినట్లు చెప్పేవారు. కాదు కాదు లంబాడీ తెగకు చెందిన వారని కొందరి అభిప్రాయం.కురువిక్కారన్ తెగలో స్త్రీలే అందమైన వారుగా పరిగణించేవాళ్ళు. అలాగని మగవాళ్ళూ తీసిపోరు. ఈ తెగలో స్త్రీ బానిసగా ఉండటమనేది లేదు. కానీ సాయంత్రం ఆరు గంటలలోపల బయటకు వెళ్ళిన స్త్రీ తన భర్త దగ్గరకు వచ్చెయ్యాలనే కట్టుబాటుంది. భర్త చనిపోతే పునర్వివాహం చేసుకునే సంప్రదాయం ఉంది.వీరికి చదువంటూ లేదు. ఆరోగ్యం విషయంలో జాగర్తలు పాటిస్తారు. చూడటానికి పరిశుభ్రంగా కనిపించకపోయినా నాటు మందులే వీరిని ఆరోగ్యంగా ఉంచేది.ప్రత్యేకించి పిల్లలకు పొట్టలో నులిపురుగులు చేరకుండా ఉండేందుకు ఏడాదికొకసారి తమ పారంపర్యగా వచ్చే మందుని పట్టిస్తారు.స్త్రీలు హస్తాకళానైపుణ్యం కలిగిన వారుశమ.పురుషులు గురిపెట్టి దానిని ఉండీకోలుతో పడగొట్టేయడంలో దిట్ట. వీరికి మాట్లాడ భాష ఉంది తప్పించి రాయడానికి లిపి లేదు. తమిళనాడు ప్రభుత్వం వీరిని బీసీలుగా పరిగణిస్తోంది.అయినా వీరిలో కొండప్రాంతాలలో నివసించే విధానాన్నే ఎక్కువగా పాటిస్తారు.ఎక్కువగా సంచార జీవనానికే ఇష్టపడతారు. కనుక వీరు పాటలు పాడుతారు. పచ్చ పొడుస్తారు. రోడ్ల పక్కనే గుడారాలు ఏర్పాటు చేసుకుని గుంపులుగా నివసించేవారు. ప్రభుత్వం వీరికి ఉచితంగా ఇళ్ళు కట్టించింది. ఇళ్ళపట్టాలు కూడా ఇస్తోంది. పొట్ట గడవడం కోసం ఊళ్ళు పట్టుకుతిరుగుతారు.ఎక్కడికెళ్ళినా తమతోపాటు తమ వస్తువులన్నీ తీసుకుపోతారు. ఎక్కడంటే అక్కడే జీవిస్తారు.కాలక్షేపం కోసం ట్రాన్సిస్టర్ ఒకటుంటుంది. ఆ ట్రాన్సిస్టర్ రేడియోకి అటూ ఇటూ తాడు కట్టి భుజాన వేసుకుంటారు. అందులో పాటలు వింటూ పని చేసుకుంటారు. క్రమంగా వీరి దగ్గర walkman ఉండేది.సంచారం చేసేటప్పుడు పసిపిల్లలను భుజాన ఓ గుడ్డ పట్టుగా కట్టి అందులో కూర్చోపెట్టుకుంటారు. కాస్త చిన్నపిల్లలనైతే భుజంమీద కూర్చోపెట్టుకుంటారు.వీళ్ళు పూసలు గుచ్చేటప్పుడు సూదులు గట్రా నడుముకి (స్త్రీలైతే మెడలో) సంచీ లేదా డబ్బా కట్టుకుని చాలా తేలికగా పని చేసుకుంటూ పోతారు.ప్రస్తుతం వీరు పౌంచ్pouch వాడుతున్నారు.ఇలా కురువిక్కారన్ తెగ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. వీరి జీవనం ప్రకృతితో కలిసుండటంతో వీరిదంతా అనుభవ జ్ఞానమే అధికం. ఓ సమూహంగా కలిసే ఉంటారు. సాహిత్యం, కథలు, పాటలు, సినిమాలు ఇలా అన్నింట్లోనూ వీరి గురించి ఏదో ఒక ప్రస్తావన ఉంటూ ఉండేది.ఎన్నికల సమయంలో మాత్రం వీరోని భారతీయులుగా గుర్తించి ఆ తర్వాత నిర్లక్ష్యం చేయడం సర్వసొధారణంగా జరిగే తంతుశమ.ఊళ్ళు పట్టుకుని తిరిగే వీరిలోనూ ఇరవై రకాల వాళ్ళున్నారని కొందరి అభిప్రాయం.కురవన్ అనగానే మనకు గుర్తుకొచ్చేది వీధుల్లో ఓ మూల పడుకుంటారని. ఎక్కడంటే అక్కడ తిరుగుతారని. కానీ కురవన్ అనే తెగకు నరికురవన్ కూ ఎలాంటి సంబంధమూ లేదనేవొరూ ఉన్నారు.నరికురవన్ తెగవారి భాష, సంప్రదాయం, అలవాట్లు ఓ సాధారణ కురన్ తెగ ప్రజల అలవాట్లకు భిన్నంగా ఉంటాయి.తమిళనాడులో కురవర్, ఉప్పుకురవర్, తప్పై కురవన్, గంధర్వ కోట్టయ్ కురవర్, ఆత్తూర్ కీయ్ నాడు కురవర్ ( సేలం) , దాడి కురవర్ (తంజావూరు, తిరుచ్చి), మలై క్కురవర్, ఇంజిక్కురవర్ (తంజై తిరుచ్చి),కొరవర్ (చెంగల్పట్) , తని క్కురవర్, తోగమలై కురవర్, వరగ కురవర్, కళింజితప్పయ్ కొరవర్ (తంజై పుదుక్కోట్టయ్), మోండా కురవర్, పొన్నై కురవర్ (ఉత్తరార్కాడు), సేలం మేలనాడు కొరవర్ (మదురై, కోవై, ఈరోడ్, పుదుగై, తిరుచ్చి, సేలం), చక్ర తామడై కురవర్, సేలం ఉప్పు కురవర్, సారుంగప్పళ.ళి కురవర్ ఇలా రకరకాల తెగ వారున్నారు. కానీ వీరందరూ అన్నింట్లోనూ వెనుకబడే ఉన్నారు. 2005లో నరిక్కురవర్ ఇనవరైవియల్ అనే పేరిట కర్సూర్ పద్మభారతి ఓ పుస్తకంకూడా రాయడం విశేషం.- యామిజాల జగదీశ్
August 12, 2020 • T. VEDANTA SURY • Memories