ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చిన్నప్పుడు మా బడిలో ప్రతీ జెండా వందనానికి క్రీడాపోటీలు జరుగుతుండేవి.. అప్పుడు ఇప్పుడున్నంత బలంగా, దృఢంగా లేకపోవడం వల్ల కావొచ్చు ఏ ఆట ఆడుదామన్నా భయం వేసేది. కానీ క్విజ్, వ్యాసరన, ఉపన్యాస పోటీల్లో మాత్రం ముందుండేవాడిని..బహుశా పత్రికాపఠనం అనే మా చెడ్డ అలవాటు వల్ల కావొచ్చు. మొదటి రెండు స్థానాల్లో ఏదో ఒక ప్రైజ్ గెలుచుకునే వాన్ని. అప్పట్లో స్టేజీ మీద యాకయ్య సార్ పేరు చదువుతుంటే హెచ్ ఎం వీరభద్రాచారి సార్ చేతుల మీదుగా బహుమతి అందుకోవడం గొప్పగా అనిపించేది. కాలేజీ చదువుల్లో అంతకు మించి అందుకున్నా జెండావందనానికి, ఆ పోటీలకు విడదీయరాని బంధం. అదో నోస్టాల్జియా. గుర్తుకు వచ్చినప్పుడల్లా కండ్ల పొంటి నీళ్లు. కొవిడ్ వల్ల దునియా మొత్తం గాయి గాయి అయితాంది. ఈ పాడు దినాల్లో పేదోళ్ళకు కూరగాయలు, నిత్యావసరాలు పంచా. నా ఉడుతాభక్తి సాయాన్ని చూసి మనం ఫౌండేషన్ వాళ్లు భారత్ రాజశ్రీ అవార్డు ఆన్ లైన్ లో పంపారు. సరిగ్గా జెండావందనం రోజు పంపంగనే మళ్లీ నా బచ్ పన్ రోజులు యాదికొచ్చినయ్.---భాస్కర్ ఎనబోతుల
August 15, 2020 • T. VEDANTA SURY • Memories