ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చిన్న చిన్నj చిట్కాలు-1..: - పి . కమలాకర్ రావు
November 21, 2020 • T. VEDANTA SURY • health tips

తుమ్ములు అలర్జీ నివారణ..
 కొద్దిగా అల్లం రసం లో తేనె కలిపిచప్పరిస్తూ తింటే   తుమ్ములు , అలర్జీ, దద్దుర్లు కూడా తగ్గిపోతాయి...
 వాంతుల నివారణ... పుదీనా ఆకుల రసం,  అల్లం రసం,  తేనె కలిపి త్రాగితే వాంతులు వెంటనే తగ్గిపోతాయి.
పిక్కల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి...కొందరికి నిద్రలో పిక్కలు పట్టేయడం వల్ల చాలా నొప్పి వస్తుంది. సొంటి పొడి లో నువ్వుల పొడి కలిపి తేనె కూడా కలిపి ప్రతిరోజు వరుసగా తీసుకుంటుంటే పిక్కలు పట్టేయడం, పిక్కల్లో నొప్పి , మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి కూడా తగ్గిపోతుంది.
 ముఖం పై నల్ల మచ్చలు... కోడిగుడ్డు తెల్లసొనలో, ఓట్స్ పొడి, కొద్దిగా పెరుగు, కొద్దిగా తేనె, కలిపి గిలకొట్టి, ఒక దూది ఉండ తో ముఖంపై లేపనంగా చేసుకుని, ఒక అరగంట తర్వాత కడుక్కోవాలి. అలా కొన్నాళ్ళు చేస్తే, ముఖం పై నల్ల మచ్చలు మాయమైపోతాయి.
తక్షణ శక్తి కోసం( Instant Energy).... పాలలో ఎండు ఖర్జురా పొడిని వేసి అందులో కొద్దిగా కుంకుమపువ్వు, యాలకుల పొడి వేసి బాగా మరిగించి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె కూడా కలిపి త్రాగాలి. వెంటనే శారీరక బలహీనత పోయి మంచి ఉత్సాహం వస్తుంది.