ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చిరంజీవులు--:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
November 2, 2020 • T. VEDANTA SURY • Poem

పొద్దు పొడుపు వెలుగులు
వెన్నెలకున్నా తళుకులు
ఎగిరే పిట్టల బారులు
నదిలో అలల గలగలలు
మాటల తేనెల జల్లులు
చల్లని వెన్నెల సోనలు
చక్కని సిరుల మేరులు 
చిన్నారి చిరంజీవులు !!