ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చిలుక -జామపండు--రావిపల్లి వాసుదేవరావు--పార్వతీపురం pH.no.9441713136.
October 1, 2020 • T. VEDANTA SURY • Poem

పెరటిలోని జామచెట్టు విరగకాసింది
ఎర్రముక్కు చిలకలేమో వచ్చిచేరాయి
మంచి జామపండ్లను కొరికితిన్నాయి
పలకబారని పండ్లను వదలివేశాయి
మాతమ్ముడు చిలకలను చూసినవ్వాడు
వాటిలోని ఒకచిలుక కావాలన్నాడు
నాన్నేమో చిలక కై చెట్టు ఎక్కాడు
నాన్నను చూసిన చిలకలు తుర్రుమన్నాయి