ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చీమకైనా హాని చేయని : పద్మ త్రిపురారి-- జనగామ.
November 11, 2020 • T. VEDANTA SURY • Videos

పల్లవి:::

చీమకైనా హాని చేయని
చిగురు మనసుల లోకమానాడు
చిటికెలోన ఉసురు తీసెడి
చిత్తమున్న మనుషులీనాడు.

             ""చీమ"

చరణం::

మనిషి మనిషిలొ మమత నింపి
మానవతకే దారిచూపిన లోకమానాడు
మనుషులందున పగను పెంచి
మరబొమ్మ చేసిన కాలమీనాడు.

       "చీమకైనా"

చరణం::

సాటిమనిషిని దైవమనుకొని
స్వాగతించిన లోకమానాడు
సరిలేరు లేరు మాకెవ్వరనుచు
చాటి చెప్పెడి జనులె ఈనాడు.

         ""చీమకైనా"

చరణం::

సదాచారము సంప్రదాయము
వెల్లివిరిసిన లోకమానాడు
సన్మార్గమందున నడువలేక
గతిని తప్పిన లోకమీనాడు

       "చీమకైనా"

చరణం::
నదిన పారెడి అలల రీతిగ
మలినమన్నది లేక సాగిన లోకమానాడు
మదిన పారెడి విషపు భావన
వలలు వేసిన లోకమీనాడు

         "చీమకైనా"'