ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చూపు--కె ఎస్ అనంతాచార్య
September 23, 2020 • T. VEDANTA SURY • Poem

ఒక దృశ్యం భావాల్లోకి తర్జుమా అయిందో లేదో నయన విచారణ షురూ!

ప్రత్యేకతను సంతరించుకుని
భవితను మార్చే ప్రతి పాదన!

గాఢత  వెచ్చదనం లోంచి పుట్టిన
 ఆలోచనా ప్రచోదన!

ప్రేమికులిద్ద రి చూపుల సంభాషణలో హృదయ సంగమ వేడుక

చూపులు కలసిన శుభవేళ
మోగే కళ్యాణ వీణ

ఏదో తెలియని
ఆప్యాయత లోంచి
 అంకురించిన స్నేహం

స్వాతి చినుకులు  
గురువు దృక్కులు 
ప్రసరించినప్పుడే కదా
 మేధో ముత్యం విరిసేది

ఒక్క ఓరచూపు
 సమ్మోహితకు చిక్కని
చేప వుంటుందా


 ప్రసవ వేదన
శిశువును చూడగానే ఆనందంగా
పరిణమించే  అమాయకత!

 దొంగ కెప్పుడూ అదను కోసం చూపు వంచకు డికేమో
గుడ్లగూబ  చూపు!


అమ్మ చల్లని చూపు
చింతలన్ని ఎడబాపు
జీవితానికి పెద్దకాపు
చూపు!!


లోచూపంటే తప్ప
కష్టాల కడలి ఈదలేరు
కావ్యసృజన చేయలేరు