ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చెట్టు కథ: అన్నాడి జ్యోతి,సిద్దిపేట.
September 3, 2020 • T. VEDANTA SURY • Story

"వృక్షో రక్షతి రక్షితః "
అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే అక్కడ స్నేహితులతో కలిసి పెద్ద చెట్టు కింద కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ,ఆచెట్టుకింద ఎన్నో ఆటలు ఆడుకునే వాళ్ళం.ఆచెట్టును మా అమ్మ పదవ పుట్టినరోజు సందర్భంగా (5వ, తరగతి చదువుతున్నప్పుడు ) మా తాతగారు మా అమ్మ చేత నాటించానని నాతో చెప్తూ ఉంటారు.మనం మొక్కనాటిన తర్వాత అది నాటుకొని పెద్దగయ్యేవరకు దాని రక్షణ బాధ్యత కూడా మనమే చూసుకోవాలి."వృక్షో రక్షతి రక్షితః"వాటిని మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి.మనకు పూలను,పండ్లను, నీడను,కలపను యిస్తాయి.ముఖ్యంగా మనకు ఆక్సిజన్ (ప్రాణవాయువు)ను ఇస్తాయి.వాయు కాలుష్యాన్ని కూడా పారద్రోలుతాయి.అదీ కాకుండా మనం చదువుతున్న పుస్తకాలు కూడా  చెట్లతోనే తయారు చేస్తారని చెప్పారు. చెట్లు వుంటేనే వర్షాలు కురుస్తాయని అన్నారు.కాబట్టి మనం  ప్రతి ఒక్కరం ఒక్క మొక్కైనా నాటి, దానిని రక్షించి ముందు తరాలకు అందించాలని  తాతయ్య ఎప్పుడూ చెప్తుంటారు.అంటూ సమత తన స్నేహితురాలితో చెప్పి,తన స్నేహితురాలు పుట్టినరోజున తనకు ఒక మొక్కను బహుమతిగా యిచ్చి ఆ మొక్కను నాటించింది.
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు వాళ్ళు
ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి‌. పర్యావరణాన్ని కాపాడండి