ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చెరువు:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
November 10, 2020 • T. VEDANTA SURY • Poem

ఊరికి అందం చెరువండీ
చెరువుకు అందం నీరండీ
చేపలు అందం నీటిలోన
పువ్వులు అందం నీటిపైన
చేలను పంటలు పండాలి
ఇంటను పాడి నిండాలి
నీటిని కలుషితం చేయొద్దు
రోగాలపాలు కావద్దు
చెరువు నీటిని కాపాడండి
ఆరోగ్యంగా ఉండండి !!