ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చేమ ఆకులు, చేమ దుంప .. ఔషధ గుణాలు . పి . కమలాకర్ రావు
November 5, 2020 • T. VEDANTA SURY • health tips
  •  చేమ ఆకులకు రక్తాన్ని గడ్డకట్టించే గుణం ఉంది. కొన్ని చేమ ఆకులు కాడల తో  తెచ్చి బాగా కడిగి ముక్కలుగా కోసి ఒక గిన్నెలో వేసి కొద్దిగా చింతపండు వేసి నీరు పోసి బాగా మరిగించాలి. చల్లారిన కషాయాన్ని త్రాగితే అరిశె మొలలు తగ్గిపోతాయి బయటకు వచ్చిన మొలలు కూడా లోనికి ముడుచుకుపోతాయి. కడుపులోని పుండ్లకు ఇది మంచి మందు. ఎక్కడైనా కత్తి కాట్లకు రక్తం కారుతుంటే చేమ కూర కాడల రసం పూస్తే రక్తస్రావం ఆగిపోతుంది జలగలు కుట్టి గట్టిగా పట్టి వదల నప్పుడు చేమకూర కాడల రసం పూస్తే జలగలు వెంటనే వదిలి పెడతాయి. కందిరీగ కాటు, తేలు కాటు కు కూడా ఇదిమంచి మందు. చేమదుంపలు ఆహారంలో ఎక్కువగా వాడితే ఆస్తమా వ్యాధి తగ్గుముఖం పడుతుంది. చేమదుంపలు కోలన్ క్యాన్సర్  కు మంచి మందు. చేమ గడ్డలు పొట్టు  తీసి  నీరు పోసి మరిగించి కషాయాన్ని త్రాగితే నీళ్ళ విరేచనాలు తగ్గి పోతాయి.