ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చైతన్య రాగం ..:-చీకట్ల సంగీత--జగిత్యాల.
October 27, 2020 • T. VEDANTA SURY • Poem

పద పద ముందుకు,
ఒక్కడివే సాగిపో 
మున్ముందుకు..!

కారు చీకట్లు -
చీల్చుకుంటూ,
పడ్డచోటు నుండే -
పరుగు మొదలేడుతూ,
అవమానాలను 
బహుమానాలుగా
 స్వీకరిస్తూ.....
అలసటలేక సాగిపో..!

కష్టాన్ని-----
 ఇష్టంగా మలుచుకొని,
సవాళ్ళను స్వీకరించి,
నిరంతర సాధన తో,
ముందుకు --
ఒక్కడివే సాగిపో..!

ఒక్క అడుగుతోనే ,
అడుగు మొదలు.
ఒక్క ఇటుకతోనే,
ఇల్లు మొదలు.
ఒక్కడితోనే-
 జగతికే వెలుగు!

నీకు నీవే వెయ్యి ఏనుగుల
 బలంగా మారిపోయి,
అంతిమ విజయంతో ,
చరిత్రలో-----
ఒక్కడివై నిలిచిపోతావు!!