ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చైతన్య వీణ--మొహమ్మద్ అఫ్సర వలీషా --ద్వారపూడి( తూ గో జి )
October 6, 2020 • T. VEDANTA SURY • Poem

ఆర్ధిక స్తోమత లేకున్నా 
నీ ఆశయం అవని అంత ....

అనంత మైన ఆకాశాన్ని
 అందుకోవాలనే నీ తపన 
అంబరమంత....

అంచెలంచెలుగా ఎదుగు 
అంబేద్కర్ లా అంటరానితనాన్ని రూపుమాపేంత .....

అబ్దుల్ కలాం లా అవతరించు 
విజ్ఞాన శాస్త్రాలతో 
విజయుడ వయ్యేంత....

అసత్యాన్ని విడనాడు 
అహింసకు పట్టం కట్టు
ఆదర్శ మూర్తి మహాత్మంత....

మానవత్వపు దుప్పటి కప్పుకో
మహిమాన్విత 
మదర్ థెరిసా అంత....

అవరోధాలను అడ్డుకో 
చైతన్య వీణతో 
ఆత్మ విశ్వాసపు సింహాసనం
 చేరుకొనేంత....