ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
జంట పదాలతో పాట:--సత్యవాణి 8639660566
September 17, 2020 • T. VEDANTA SURY • Poem

బిరబిర సూర్యుడు రాకుండా
చక చక నిద్దుర లేవాలి
తళతళ మెరువగ పలువరుస
గబగబ తోముకోవాలి
గటగట పాలను తాగేసి
బరబర వొడలను రుద్దుకొని
చకచక స్నానం చేయాలి
వెలవెల పోయిన దుస్తులను
వేయక మాని వేయాలి
మిలమిల మెరిసే దుస్తులను
గబగబ వేసుకోవాలి
గంట గణగణ మ్రోగంగా'
చరచర బడికి పోవాలి
జనగణమన అని పాడేకా
చక చక తరతికెళ్ళాలి
గడగడ పాఠం చదివేసి
చెడుగుడు ఆటను ఆడాలి
బెక బెక అంటూ మేము
కప్ప గంతులను వేయాలి
జరజర జరజర జారేటి 
జారుడు బల్లలు జారాలి
కిచ కిచ లాడుతు పక్షుల్లా
ఎగురుతు దుముకుతు ఆడాలి
బిరబిర ఆటలు ఆడేసి
చరచర ఇంటికి పోవాలి
నకనక ఆకలి అంటూను
అమ్మని కరకరలడగాలి
పరపర మంటూ నమిలేసి
గడగడ పాఠం చదవాలి
మిలమిల మెరిసే కన్నులతో
అమ్మ కితకితలు పెట్టాలి
కిలకిల కిలకిల నవ్వుచు నేను
మరి మరి ముద్దులు పెట్టాలి
సంతోషంతో మాఅమ్మా
సరిగమ పదనిస పాడాలి