ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
జయరాజ్, మరొక సృష్టికర్త--తమిళ పత్రికా ప్రపంచంలో చిత్రకారుడు జయరాజ్ ఆల్ టైమ్ ఫేవరిట్. స్వాతి మ్యాగజైన్ తో తెలుగు పాఠకులకు పరిచితులైన జయరాజ్ గురించి కొన్ని విషయాలు.....కొత్త రకం చిత్రాలను పరిచయం చేసిన జయరాజ్ బొమ్మలు గీయడం మొదలంపెట్టి అరవై ఏళ్ళు దాటింంది. లక్లలాది బొమ్మలు...లెక్కలేనన్ని అవార్డులు....పత్రికలు కొనే తమిళ ఇళ్ళకు ஜெ...(జె) ఓ గుర్తు. చిన్న వయస్సులోనే బొమ్మలు గీయడం ప్రారంభించారు జయరాజ్. అప్పట్లోనే స్త్రీలను నగ్నంగా గీస్తుండేవారు. ఆ బొమ్మలను చూసి ఆయన తల్లి "ఏమిట్రా ఆ గీతలు" అని తిట్టేవారు. కోపగించుకునేవారు. కానీ ఆ వయస్సులో అదొక చిత్రం అనే తప్ప మరేదీ అనిపించేది కొదు జయరాజ్ కి.కానీ ఆయన బొమ్మలు గీస్తున్నప్పుడు అటువైపుగా వచ్చిన తండ్రి వాటిని చూసి "ఎంతందంగా వేసాడో. పొగడటం మానేసి తప్పంటావేంటీ" అనే వారు. అంతేకాదు, కొడుకు గీసిన బొమ్మలలో ఏదైనా లోటుపాట్లుంటే అవి సరిదిద్దమని ప్రోత్సహించేవారు. తండ్రి. నగ్నచిత్రాన్ని గీయడం తప్పుడు పని అని అనుకోకుండా దాన్నొక కళగా చూడటం గొప్ప విషయం. ఆ తర్వాతే జయరాజ్ అనాటమీ తగు పాళ్ళల్లో గీసేవారు."నేనేదో ఆకర్షణీయంగా బొమ్మలు గీస్తుంటానని అందరూ చెప్తుంటారు...స్త్రీ అందంగా ఉండాలి... మగపిల్లలు ఎలా ఉన్నా పరవాలేదు అనే మాట ఎప్పటి నుంచో ఉన్నదేగా" అంటారు జయరాజ్.స్త్రీలు అందంగా ఉండటమనేది ప్రకృతిలో ఉన్నదే. అందరూ అంగీకరించేదే. లేదా అందరి ఇష్టంకూడా అనుకోవచ్చు.ఓ చిత్రకారుడు బొమ్మ గీసినప్పుడు అది అందరికీ నచ్చడమనేది అంత సంలభమైన విషయం కాదు. మనసుకి సంతోషంగా ఉండాలి. మనసుని ఎప్పుడూ ఉత్సాహపూరితంగా ఉంచాలి. బీఏ ఎకనామిక్స్ చదివిన తర్వాత ఆయన ఏ ఉద్యోగానికి పోలేదు. ఆయన గీసే చిత్రాలకు విలువ ఉందని వెన్ను తట్టిన తండ్రి కొడుకు (జయరాజ్) ని కుముదం అనే తమిళ వారపత్రికకు వెళ్ళమన్నారు అప్పట్లో కుముదం పత్రిక సంపాదకుడు ఎస్.ఎ.పి. అణ్ణామలై గారిని కలవడం అంత సంలభం కాదు....ఏదో కథలో చెప్పినట్లు సప్త సముద్రాలు, ఏడు కొండలు దాటడం లాంటిది! కొనీ జయరాజ్ చాలా సులువుగా ఆ సంపాదకుడోని కలిశారు. గీసిన బొమ్మలను ఆయనకు లోపలకు పంపించమని చెప్పి కూర్చునేలోపే జయరాజ్ కి పిలుపొచ్చింది లోపలకు రమ్మని!జయరాజ్ లోపలకు వెళ్ళడంతోనే ఎడిటర్ గదిలో మరో ముగ్గురున్నారు. జయరాజ్ బొమ్మలు ఎడిటర్ ఎస్.ఎ.పికి ఎంతగొనో నచ్చాయి. రంగరాజన్ అనే ఆయన రాసిన కథను జయరాజ్ కు ఇచ్చి ఓ బొమ్మ గీసి చూపమన్నారు.జయరాజ్ అప్పటికప్పుడు బొమ్మ గీసి ఎడిటర్ కి ఇచ్చారు. ఆయనకది ఎంతగానో నచ్చింది. జయరాజ్ చిత్రకళా జీవితాన్ని వర్ణమయం చేసింది ఎడిటరేనని చెప్పిన జయరాజ్ "దినమణి కదిర్" అనే పత్రికలో ఎలాంటి కట్టుబాట్లు లేకుండా బొమ్మలు గీయమని ప్రోత్సహించిన వారు "సావీ" గారు.సుజాత అనే ప్రముఖ రచయిత రాసిన వాటికీ బొమ్మలు వేసే అవకాశం వచ్చింది జయరాజ్ కి.తన బొమ్మలతో యవ్వన హృదయాలనం కట్టి పడేసిన జయరాజ్ "సావి" గారిని మరచిపోలేనన్నారు. జయరాజ్ ని సావిగారు ఐరోపా దేశాలకూ‌, అమెరికాకు తమతో తీసుకుపోయి అక్కడి అందాలను చూపించారు. సావిగారు ప్రతీ ఏడాది జనవరి ఒకటో తేదీన తప్పనిసరిగా ఓ కొత్త రూపాయి నోటు జయరాజ్ కి కానుకగా ఇచ్చేవారు. ఆ కొత్త నోట్లను జయరాజ్ సావీగారి గుర్తుగా దాచుకున్నారు. సావిగారికి జయరాజ్ అంటే ఎంతిష్టమో మాటల్లో చెప్పలేం. జయరాజ్ ఓమారు కళైంగర్ కరుణానోధిని చూసిన క్షణొలనూ మరచిపోలేనన్నారు. కళాకారులను గౌరవించడం ఆయనకే చెల్లు అంటారు జయరాజ్. కరుణానిధి గారు జయరాజ్ ని పక్కనే కూర్చోపెట్టుకుని తాము రాయబోయే చారిత్రక సీరియల్ కి ఎలా బొమ్మలు వేస్తే బాగుంటుందో అని చర్చించారట. తెన్ పాండి సింగం, పాయుం పులి, కురళోవియం, రోమాపురి పాండియన్ వంటి కరుణానిధి రచనలకన్నింటికీ జయరాజే బొమ్మలు వేశారు. జయరాజ్ బొమ్మలను తెగ పొగిడారు. కుముదం పత్రిక సంపాదకులు ఎస్.ఏ.పి. తొలి కలయికలోనే జయరాజ్ తో చాలాసేపు మాట్లాడటాన్ని గుర్తు చేస్తూ "ఏం మాయ చేశావో ఏ మంత్రం వేశావోకానీ ఆయన ఇంతసేపు నీతో మాట్లాడానేంటీ" అని అన్నారట అక్కడే ఉన్న ఓ రచయిత అనగొనే మరొక రచయిత "మంత్రం ఏదీ వెయ్యలేదు...బొమ్మ గీశాడు" అన్నారట. అప్పుసామి, సీతాపాట్టి అనే ఓ సీరియల్ లో తాత బొమ్మ గీయడానికి జయరాజ్ మైలాపూరులో చూసిన ఓ తాతను జ్ఞాపకం చేసుకున్నారట. ఆ మైలాపూర్ తాతనే అప్పంసామిగా పాఠకుల ముందుకొచ్చారు మరి తాతకో బామ్మ కావాలిగా అని అనుకంని గీసిన తాత బొమ్మకే కొన్ని మార్పులు చేయగా అది బామ్మ సీతగా పుట్టుకొచ్చిందంటొరు జయరాజ్. జయరాజ్, ఆయన భొర్య రెజీనా ఏదైనా పెళ్ళికి వెళ్తే "అప్పుసామి - సీతాపాట్టి" వచ్చేసొరని అక్కడోవారు ఘనంగా స్వాగతించి ప్రత్యక ఐతోథులుగా చూసేవారు.జయరాజ్ గీసిన బొమ్మలను కుముదం, ఆనందవిగడన్, కుంగుమం వంటి ప్రధాన వారపత్రికలు ముఖచిత్రాలుగా ప్రచురించడం విశేషం. ఇవన్నీ తనకు లభించిన గొప్పతనమేనని ఎంతో వినమ్రంగా చెప్పే జయరాజ్ కు 1962లో పెళ్ళయింది. రెజీనా తన భాగస్వామి కావడం ఓ వరమనుకుంటారు జయరాజ్. ఆమె ప్రేమ మాటలకతీతం అంటుంటారు. ఆమె ప్రేమను బొమ్మలలో గీసి చూపలేనన్నారు జయరాజ్. రెజీనా అంటే తన కుటుంబంలో అందరికీ ఇష్టమట.తోటివారినే కాదు, పిల్లికూనలూ ఉడుతపిల్లలుకూడా ఆమెను చూసిపోతుంటాయట ప్రేమతో. వాటితో రెజీనా మాట్లాడుతుంటే ఏదో పిల్లలతో మాట్లాడుతున్నట్లే అనిపిస్తుందట జయరాజ్ కి.ఎక్కడికెళ్ళినా జయరాజ్ సొరా అని చిర్నవ్వుతో పలకరించి కరచాలనం పొందేంత అభిమాన చిత్రకారుడిగా మారడం తలచుకుంటుంటే ఎంత ఒ ఆనందమేస్తుందో అంటారు జయరాజ్.అవును, అది ఆయనకు బొమ్మలు తెచ్చిపెట్టిన హోదా. గౌరవం. మర్యాద. ఒకటేంటి అన్నీనూ. ఆయన పూర్తి పేరు "థామస్ జయరాజ్ ఫెర్నాండో". ఆయన వేసిన మొదటి బొమ్మకు పది రూపాయల పొరితోషికం లభించింది. ఆయన క్షణాల్లో వేసే బొమ్మలు ప్రశంసలు సంపొదించిపెట్టాయి. ఆయన దాదాపు నలభై అయిదు మ్యాగజైన్లకు బొమ్మలు వేశారు. బొమ్మలొక్కటే కాకుండా ఆయన కాస్ట్యూమ్ డిజైనర్ గానూ ఆయన నెంజత్తయ్ కిళ్ళాదే, జానీ చిత్రాలకు తన సేవలందించారు.1964 లో వచ్చిన కాదలిక్క నేరమిల్లయ్ అనే తమోళ సినిమాకు పబ్లిసిటీ పోస్టర్లుకూడా వేశారాయన. అంతేకాదు, ఆక్స్ ఫోర్డ్ నిఘంటువుకి కూడా ఆయన బొమ్మలు వేశారు. ఆయన పాఠకులకు ఎప్పుడూ చెప్పే మాట..."శక్తిమంతమైన సినిమా మాధ్యమాన్ని చూడండి. వద్దనను. కానీ చిత్రకళపట్ల ఉన్న ప్రేమను ప్రేమించండి. ఆదరించండి..." - యామిజాల జగదీశ్
August 6, 2020 • T. VEDANTA SURY • Memories