ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
జరభద్రం ...: --చీకట్ల సంగీత, జగిత్యాల
November 8, 2020 • T. VEDANTA SURY • Poem

ముఖంలో నవ్వులు చిందిస్తూ
మనసులో--
కాలకూటవిషాన్ని నింపుకొని,
తియ్యని మాటలతో-
కమ్మగా మాట్లాడుతూ,
తేనె పూసిన కత్తిలా
గొంతులు కోస్తారు కొందరు !

అన్యాయానికి ఒడిగట్టి ,
కపటప్రేమలు కురిపిస్తూ,
లేని ప్రేమలు వలకబోస్తూ,
ఎదుటి వారి ఎదుగుదలకు 
 ఓర్వలేక-వెనకాలే,
గోతులుతీసే -
 గుంటనక్కలు,
ఇంకొందరు ....!!


అందితే కాళ్ళు -
అందకపోతే జుట్టు ,
అన్నట్టు-
నమ్మకాన్ని 
నయవంచనజేసే
నమ్మకద్రోహపు 
మనుషులు..
మరికొంద రు..!

మాట ఇచ్చి --
మానవత్వపు విలువలు
మరచిన-
మనసు లేని మనుషులు,
ఎందరెందరో...!

తస్మాత్ జాగ్రత్త...
మోసపూరిత -
ముసుగుతో,
స్వార్థపూరితంగా,
నటనతో నటించే-
మానవ మృగాల తో,
జాగ్రత్త సుమీ....!!