ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
జలుబు, దగ్గు, ఆయాసం తగ్గడానికి...పి . కమలాకర్ రావు
November 8, 2020 • T. VEDANTA SURY • health tips
  •  చలి కాలం మొదలయింది. చాలామంది వాతావరణంలో మార్పు వల్ల జలుబు, దగ్గు ఇబ్బందులు పడుతున్నారు.  వెల్లుల్లిని ముద్దగా చేసి అందులో బెల్లం కలిపి ఉండగా చేసి మింగాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిని త్రాగాలి. యాలకుల పొడి సొంటి పొడి లవంగాల పొడి వేడి నీటిలో కలిపి మరిగించాలి. గోరువెచ్చగా వున్నప్పుడు త్రాగాలి. జలుబు దగ్గు ఆయాసం. తగ్గిపోతుంది. పాతనేయ్యి తెచ్చి అల్లం రసం కర్పూరం  కలిపి వేడి చేసి చల్లార్చి  ఛాతి పై పూతగా వాడితే జలుబు దగ్గు తగ్గిపోతుంది. పెరుగులో బెల్లం, మిరియాలపొడి వేసి కలిపి తింటే జలుబు తగ్గుతుంది. జిలకరలో పసుపువేసి కొద్దిగా వేయించి బెల్లం కలిపి గుడ్డలో కట్టి వాసన పీలుస్తుంటే  జలుబువల్ల వచ్చిన శిరోభారం తగ్గిపోతుంది. పాలలో పసుపు మిరియాలపొడి వేసి మరిగించి గోరు వెచ్చగా వున్నప్పుడు త్రాగితే జలుబు తగ్గుతుంది. తిప్పతీగ కాడలు నలగ్గొట్టి కషాయంగా కాచి తేనె కలిపి త్రాగితే జలుబు, దగ్గు, ఆయాసం, తగ్గి పోతుంది. ఇది జ్వరాన్ని కూడా రానివ్వదు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.