ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
జలుబు జ్వరం - నివారణ --పి. కమలాకర్ రావు
October 12, 2020 • T. VEDANTA SURY • health tips

కొన్ని జామాకులు మరియు తిప్పతీగ ఆకులు తులసి ఆకులు ముక్కలుగా చేసి నీటిలో వేసి మరిగించి చల్లార్చి త్రాగితే జ్వరం తగ్గిపోతుంది. తిప్పతీగ కు వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువ. కొన్ని నేల ఉసిరి ఆకులను. మరియు తిప్పతీగ ఆకులను నీటిలో వేసి అందులో అతిమధురం పొడిని కలిపి కషాయంగా కాచి చల్లార్చి త్రాగితే జ్వరం తగ్గిపోతుంది. కొన్ని పారిజాతం ఆకులు తెచ్చి అల్లం ముక్కలతో కలిపి నీటిలో వేసి మరిగించి చల్లార్చి అందులో తేనె కలిపి త్రాగితే ఆగి ఆగి వచ్చే జ్వరం తగ్గిపోతుంది. పారిజాతం ఆకులు రక్తంలోని ప్లేట్ లెట్స్ తగ్గకుండా కాపాడతాయి. తిప్పతీగ కాడల రసం లో తానికాయల పొడి కలిపి మరిగించి చల్లార్చి కలకండ లేక తేనె కలిపి త్రాగించి నా జ్వరం తగ్గిపోతుంది,,జలుబు కూడా తగ్గిపోతుంది