ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
జాతిరత్నం ..-కళావతి కందగట్ల,9948263004- హైదరాబాద్
October 2, 2020 • T. VEDANTA SURY • Poem

మహాత్ముడు మన గాంధీజీ 
బాలల తాత మన బాపూజీ 
పోరుబందరు ముద్దు బిడ్డరా 
పోరు బాటలో నడిచెనురా 

అసత్యము పలుకని వాడు 
అహింసనే  నమ్మిన వాడు...
కులమత భేదం వలదన్నాడు 
అస్పృశ్యతను  కాదన్నాడు 

స్వాతంత్ర్య మే లక్ష్యంగా 
అన్యాయాన్ని ఎదిరించాడు 
పరాయి పాలన వద్దన్నాడు 
స్వాతంత్రమే ముద్దన్నాడు 

దాస్య శృంఖలాల 
విడిపించాడు... 
ప్రజలకు స్వేచ్ఛను కల్పించాడు 
భరత మాత ముద్దుబిడ్డరా 
జాతిపిత మన గాంధీజీ...