ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
జీలకఱ్ఱ , లేదా జిలకర ఔషధంగా -1:--మనం నిత్యం వంటకాల్లో వాడుకునే జిలకరకు అనేక ఔషధ విలువలున్నాయి. మనం తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం కానిస్తుంది. పిత్త వ్యాధులను నయం చేస్తుంది. ఇది స్త్రీల గర్భాశయాన్ని శుద్ధి చేసి ఋతుక్రమాన్ని సరి చేస్తుంది. రుచిని పెంపొందిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని పోగొడుతుంది. కంటి చూపును కాపాడుతుంది. కాలేయాన్ని బలపరుస్తుంది. కడుపులోని గ్యాస్ ను నివారిస్తుంది. పొడి దగ్గును రాకుండా కాపాడుతుంది. కొద్దిగా జిలకర ను తీసుకుని నీటిలో వేసి కషాయంగా కాచి అందులో తాటి కలకండ లేదా బెల్లం వేసి చల్లార్చి ఉదయం , సాయంత్రం తాగితే పొడి దగ్గు తగ్గి పోతుంది. నీరు మరిగించి అందులో జిలకర పొడి వేసి + ఇంగువ + ఉప్పు వేసి చల్లార్చి తాగితే పులి తెంపులు గ్యాసు మాయం. అవుతుంది. - పి . కమలాకర్ రావు .
August 5, 2020 • T. VEDANTA SURY • health tips