ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
జీవించడం ఒక కళ--కె ఎస్ అనంతాచార్య
October 7, 2020 • T. VEDANTA SURY • Poem

అందమైన లోకాల్లో విహరిస్తూ  తనను తాను మరిచిపోయి సరాదాలు తీర్చుకోవడం కాదు!

వాస్తవoలో ముళ్ళ కంచెలు దాటుతూ  దెబ్బలను తమాయించుకుంటూ ఆత్మనిర్భరతను పొందటం

 క్రుంగ దీసుకొని ఎవరి మెప్పుదల కోసమో తల తాకట్టు పెట్టడం కాదు!

ప్రకృతిని ఆరాధిస్తూ
మాధు ర్యం తో 
 భావప్రియంగా సాగడం

అంతః కరణను తోసిపుచ్చి సత్యభాషను వదులుకొని భ్రమల్లో విహరించటo కాదు

తాను మెచ్చేలా తింటూ నలుగురు మెచ్చే నడవడికతో గుండె తలుపు తట్టి
 రెండు ప్రేమ వాక్యాలు నింపడమే

నిందలు,కొట్లాటలు
నాలుగు కాళ్ల జంతువులకు మనకు తేడా లేకుండా  బ్రతకడం కాదు

రంగుల్లో చిక్కుకు పోయి
 కుంగిన  అతివలకు అండదండగా
 నిలిచే ఆత్మీయత


ఎదుటి వారికోసం తిప్పలు పడుతూ వ్యక్తిగతాన్ని మరిచి పొందే నిస్వార్థ జీవన సార్థకత
దృశ్య జగత్తులో 
పరిడవిల్లే నవ్య దర్శన శోభను చూస్తూ
ఏకాంత సమయాన్ని
ఆనంద సందోహంలో
గడిపే అద్భుత క్షణాలు

సర్వజనామోదకంగా
సాగిపోయే సంగీతమై 
జీవించడం ఒక కళ