ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
జీవితాంతం తెలంగాణ కోసం తపించిన మహా మనిషి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి నేడు- మాడిశెట్టి గోపాల్ --ఉద్యమమే ఊపిరిగా తెలంగాణ సాధనే ధ్వేయంగా పనిచేసిన జయశంకర్ సార్ ప్రస్థానం స్ఫూర్తి దాయకం. ఆయన జీవితం సంక్షిప్తంగా..1934, ఆగస్టు 6వ తేదీన వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలం, అక్కంపేటలో కొత్తపల్లి జయశంకర్ జన్మించారు.తల్లి మహాలక్షీ, తండ్రి లక్షీకాంతరావు. జయశంకర్ కు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కా చెళ్లెల్లు. ఇంట్లో రెండో సంతానం జయశంకర్.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సైద్ధాంతి ప్రాతిపదికను రూపొందించడమే కాకుండా ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉండి తెలంగాణ సాధన కోసం పనిచేశారు. విద్యార్థి దశ నుంచే ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం తపించారు. అధ్యాపకుడిగా, వైస్ చాన్సలర్ గా ఆయన తెలంగాణ కోసం వేల ఉపన్యాసాలు ఇచ్చారు. జనాలను చైతన్యం చేశారు.తొలిదశ, మలిదశ ఉద్యమాల్లో పనిచేసిన అనుభవం జయశంకర్ సొంతం. ఆయన తెలంగాణ కోసం అనేక పుస్తకాలు, వ్యాసాలు రాసి తెలంగాణ ప్రజానీకంలో భావజాల వ్యాప్తికి నిరంతరం పాటుపడ్డారు. 2011, జూన్ 21న సార్ తుదిశ్వాస విడిచారు.ఆయనకు ప్రగాఢ నివాళులు
August 6, 2020 • T. VEDANTA SURY • Memories