ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
జీవిత చక్రం ..: డా .కె .ఎల్ .వి.ప్రసాద్ హనంకొండ
November 4, 2020 • T. VEDANTA SURY • Poem

తరాల -
అంతరాలు ,
ఎన్నైనా ఉండనీ ,
బ్రతకడంలో -
బట్టకట్టడంలో ,
ఎన్నైనా --
మార్పులు రా నీయ్,

ఒకటే రక్తం 
వాహికగా ....
జన్యువులు
పునాది రా ళ్లుగా ,
ఒక తరంనుండి 
మరోతరానికి 
చేరవేస్తూనే ఉంటాయ్ ,

సహజ లక్షణాలు 
సజీవంగానే 
చిరంజీవులై 
నిలుస్తాయి .!

నాలుగు తరాల 
వంశవృక్షంలో 
నాలుగో తరం 
ప్రతినిధిని నేను .!

బువ్వమ్మ పద్మావతి ,
అమ్మమ్మ అరుణ ,
మా అమ్మ నిహార ,
ప్రేమలో బ్రతకడం ,
నాకు ----నిజంగా ,
కలిసొచ్చిన ...
అదృష్టమే మరి !!
--------
                  

ఫొటోలో: 
బువ్వ మ్మ -పద్మా వతి.
అమ్మమ్మ--అరుణ.
మా అమ్మ-నిహార
నేను....ఆన్షి.నల్లి.