ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
జ్ఞాన సంపద--కె ఎస్ అనంతాచార్య
September 7, 2020 • T. VEDANTA SURY • Poem

సముద్రమంత లోతు
ఆకాశమంత విస్తరణ
నేల గుణశీలత కలిగిన
అనిర్వచనీయ పదం 

ప్రకాశవంత మైన
దీపం మరో దీపాన్ని వెలిగిoచినట్లు
అజ్ఞానాన్ని ముక్కలు చేసి  మనో నేత్రాన్ని తెరిపిస్తుంది

శ్రద్ధయే లేకుంటే
ఏది వచ్చి చేరదు
పరిశ్రమ తోడైతే
పసిడి వెలుగుల మేధో ఆవిష్కరణ

 విద్వత్తు ఎంతున్నా
లోకజ్ఞానం లేకుంటే
అల్పుడికి కూడా లోకువ

జ్ఞానం ఏదైనా
అంతర్ మాలిన్యాన్ని
ప్రక్షాలనం చేసి ఆత్మానందం కలిగించే
ఔషధం

నిశిత ఖడ్గమై సకల
సంశయాలను
ఛేది స్తుంది

ఒక్క ఇంద్రియ సాధన వలన ఒనగూరదు
అనుభవం జోడించి
ఛేదించ గలిగేది
బ్రహ్మ పదార్థ రచన

కారకాల మాట
అటుంచి కారణాల
గురించి అన్వేషించే
అయస్కాంత ధర్మం

స్వయం సాధన అంటే
రేగడి నేల మీద తడబడుతూ 
 జారీపడుతూ ఉట్టిగొట్టి మీగడ పొందటం

ఆత్మ ప్రబోధంగా
వెళ్లి విశ్వమంతా విస్తరించి అందుకునే
సర్వస్వమే జ్ఞాన సంపద.