ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టమాటో తో పలు ఔషధాలు -మనం నిత్యం వంటకాల్లో వాడే టమాటో లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. టొమాటోలను నీటిలో వేడి చేసి పైన వుండే పొత్తును తీసివేసి మిక్సీలో గుజ్జుగా చేసి నీరు పోసి అందులో మిరియాల పొడి _ శొంఠి పొడి వేసి కషాయంగా చేసి తాగితే దగ్గు, జలుబు, ఉబ్బసం తగ్గి పోతుంది. శ్వాస కోశ సమస్యలన్నీ తగ్గి పోతాయి. ఇందులో కాన్సర్ ను నిరోధించే మందు వుంది. ఇదే కషాయాన్ని చిన్న పిల్లలకు తేనే కలిపి ఇవ్వ వచ్చు. ఒక వేళ పేగులో పుండు సమస్య ఉంటే పండు టమాటో ముక్కల్లో పెరుగు కలిపి తినాలి. కడుపులోని పుళ్ళు తగ్గు ముఖం పడతాయి. ఇందులో పొటాషియం ఉండటం వలన గుండె సక్రమంగా పనై చేయడానికి సహాయ పడుతుంది. మూత్ర పిండాల సమస్య వున్నా వారు టొమాటో తినకూడదు - పి .కమలాకర్ రావు
August 12, 2020 • T. VEDANTA SURY • health tips