ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య-ప్రమోద్ ఆవంచ
October 13, 2020 • T. VEDANTA SURY • Serial

తాతయ్య సుమారు 30 సంవత్సరాలు పైగా కావ్యాలు, వ్యాసాలు, నాటకాలు గీతాలు, డ్యాన్స్, డ్రామాలు, ఎన్నో రాసాడు.అవి అన్ని దేశాల్లో పేరుగాంచాయి.తాతయ్య ఎప్పుడూ ఏ విషయాలు చూసినపుడు ఏ విషయాలను గురించి ఆయన మనసులో దాగివున్న ఏ అనుభూతి వెలుపలికి వచ్చిందో దానికి తగినట్లు ఒక వ్యాసమో,గీతమో,నాటకమో,గీతమో,కథో,కథానికో,చిత్రించి ఇచ్చినాడు.ఇవి ఆయన జీవితంలోని అనేక సమయాల్లో అనేక చోట్ల జరిగిన సంఘటనలు ఆయన మనసుకు హత్తుకుపోయిన తన అనుభవాలను మునుముందు రాబోవు పౌరుల కోసం వదిలి వెళ్ళిన మహనీయుడు.
  తాతయ్య కవిత్వాన్ని,ఆయన తత్వ జ్ఞానాన్ని,ఆయన ప్రకృతి సౌందర్య ఆరాధన పద్ధతిని,విశ్వ మానవ ప్రేమను, దైవభక్తినీ,మనం అర్దం చేసుకోవడం చాలా కష్టం.తాతయ్య సిద్ది పొందిన జ్షాని.మహర్షికి ప్రతిబింభమై నిలిచిన విశ్వకవి.విశ్వమానసినటుడు, చిత్రకారుడు,సంగీత విద్వాంసుడు, పండితుడు.అటువంటి మన తాతయ్య కవిత్వాన్ని, గీతాలను గురించి ఎంత రాసినా తక్కువే.
   తాతయ్య రాసిన గీతాంజలి అనే పుస్తకం ప్రపంచంలోని అన్ని భాషల్లో ప్రచురించబడింది.ప్రపంచంలోని కవులు పండితులు విమర్శకులు అందరూ గొప్పగా పొగిడి తాతయ్యకు నోబుల్ బహుమతిని సమర్పించారు.మిగితాది రేపు...,