ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య-ప్రమోద్ ఆవంచ
November 1, 2020 • T. VEDANTA SURY • Serial

గొప్ప వారికి చూపించాలన్న కోరిక కలిగిన వెంటనే ఆ గీతాలను తీసుకొని వెళ్ళి ఐరిష్ కవి డబ్యు-బి-ఈట్స్ అనే గొప్ప వ్యక్తి కి చూపించాడు.ఈట్స్ గారు తాతయ్య గొప్పతనాన్ని గ్రహించి,తన మిత్రులైన ఇతర కవులను, రచయితలను,తన ఇంటికి పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఆసమావేశంలో తాతయ్య గీతాలను చదివి వినిపించారు.
                     గీతాలు చదివి వినిపించేటప్పుడు ఎక్కువ మందితో కిట కిట లాడుతున్న ఆ గదిలో పూర్తిగా నిశ్శబ్దం 
ఏర్పడింది.కవులు, పండితులు ఆ గీతాలను వింటూ తమను తామే మర్చిపోయారు.
                   గీతాలు చదవడం పూర్తయిన తరువాత ఎవరికి వారు ఏమీ మాట్లాడకుండా లేచి వెళ్ళి పోయారు.అది చూసి తాతయ్య ముఖం చిన్నబోయింది.తన గీతాలు బాగలేవేమో లేక ఇంగ్లీష్ అనువాదం సరిగ్గా లేదేమోనన్న అనుమానం కలిగింది తాతయ్యకు.అందుకే వాళ్ళు నచ్చక,నా గీతాల గురించి మాట్లాడకుండా లేచి వెళ్ళి పోయారేమోనని భయపడ్డాడు.కానీ అది నిజం కాదని తరువాత తాతయ్యకు తెలిసింది.ఆయనను అభినందించడానికి చప్పట్లు, పొగడ్తలు చాలవనీ, ఇంగ్లీష్ కవులు అనుకున్నారు.ఆయన గీతాలను ఎన్నిసార్లు ఎన్ని గొంతుకలలో పొగిడినా తక్కువే ననీ తెలుసుకున్నారు.మిగితాది రేపు....