ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య-ప్రమోద్ ఆవంచ
September 11, 2020 • T. VEDANTA SURY • Serial

తాతయ్య మేనా కథలో కింది విధంగా రాసుకున్నారు.మా ఇంట్లో మా అవ్వ కాలం నాటిది ఒక మేనా వుండేది.ధనవంతుల ఇళ్ళల్లో మేనా అవసరం చాలా వుంటుంది.మహిళలు ఎక్కడికైనా వెళ్ళాలంటే మేనా ఒక్కటే ప్రయాణ సాధనం.అది కూడా చాలా పెద్దగా వుంటుంది.రంగురంగుల చిత్రాలు, విలువైన పరదాలు,లోపల విలువైన మెత్తని దిండ్లు,చాలా అందంగా వుండేది.ఆ మేనాను వెనక ఎనిమిది మంది, ముందు ఎనిమిది మంది బంగారు కడియాలు,చెవి పోగులు ధరించి, బలంగా ఉన్న పదహారు మంది బోయిలు మోసేవారు.
రాను రాను ఆ రోజులు మారిపోయి,రోజులతో పాటు,వారి సంపద, రాచఠీవి, కూడా మాసిపోయినట్లే ఆ మేనా రంగులు కూడా వెలిసిపోయాయి.పరదాలు,దిండ్లు, చినిగి పోయి ఇప్పుడు అది ఎందుకూ పనికిరాకుండా ఓ మూలన పడి వుంది.
 అప్పటికి నాకు 7-8 సంవత్సరాల వయస్సు.ఆ వయస్సులో నాకు ఏ పనిలో కూడా కల్పించుకోవడానికి శక్తి చాలదు.కాబట్టి అప్పటి వరకు ఆ మూలనున్న మేనా, నేను ఉపయోగంలో సమానమేనని అర్దం అయింది.అందుకే నాకు ఆ మేనా అంటే ఇష్టం ఏర్పడిందేమో అనుకుంటాను.ఆ మేనా అంటే నాకు ఇష్టం ఏర్పడడానికి కూడా కారణం వుంది.అది నడిసముంద్రంలో నాకొక ద్వీపం లాంటిది.విరామ సమయంలో నేను రాబిన్ సన్ క్రూసో నైపోతాను.ఎవరికీ కనబడకుండా నాలుగు వైపులా తలుపులు గట్టిగా బిగించుకొని,ఆ మేనాలో కళ్ళు మూసుకుని కూర్చుంటాను.మేనా బయట మా ఇల్లు మాత్రం జనంతో కిటకిటలాడుతూవుంటుంది.బందువులుస్నేహితులు ఎవరెవరో అంతా వుంటారు.మిగితాది రేపు.......