ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య-ప్రమోద్ ఆవంచ
October 28, 2020 • T. VEDANTA SURY • Serial

మౌన ముద్రలోనే మనసుకు, మేధస్సుకు, శరీరానికి, ఆత్మకు శాంతి దొరుకుతుందని తాతయ్య భావించేవాడు.మౌనముద్ర తరువాత పిల్లలందరూ ప్రార్థన చేసేవారు.
                         తాతయ్యకు మతాల మీద నమ్మకం ఉండేది కాదు.ఆయనకు విశ్వ మానవ సమాజాన్నే కోరుకునే వాడు.మతాల వల్ల మనుషుల్లో విభేదాలు వచ్చి చీలిపోవడం చూసి ఆయన చాలా బాధ పడేవాడు.తాతయ్య విశ్వ మానవ ఐక్యత, ప్రేమ అనే భావాలు వున్న వాడు కాబట్టి తన తండ్రి స్థాపించిన బ్రహ్మ సమాజం కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే వాడు కాదు.ఆయన విశ్వ మానవ సమాజం స్థాపనకు ప్రయత్నాలు సాగిస్తూ వుండేవాడు.
                       తాతయ్య స్థాపించిన పాఠశాల అన్ని విధాలా సక్రమంగా నడుస్తూ, తాను ఆశించిన ఉద్దేశాలన్నీ పూర్తయి, పాఠశాల పేరు దూర దేశాలలో కూడా ప్రసిద్ధి చెందింది.ఇతర దేశాలనుండి టీచర్లు వచ్చి, ఆశ్రమంలో చేరడం చూసి తాతయ్య చాలా ఆనందించేవాడు.కానీ ఆయన సంతోషానికి అగ్ని పరీక్ష పెట్టినట్లు,ఆయన అనేక చిక్కుల్లో పడిపోయాడు.
                 పాఠశాల నడపడానికి డబ్బు లేదు.విద్యార్థుల నుంచి ఫీజు తీసుకునే పద్దతి ఆశ్రమంలో లేదు.అందుకే తాతయ్య తన సొంత ఆస్తినంతా ఖర్చు పెట్టినాడు.అది చాలక భార్య నగలు కూడా అమ్మి కొంత కాలం పాఠశాలను నడిపించాడు.అయినా సరిపోలేదు.సమస్యలు ఇంకా అధికం అయ్యాయి.1902, నవంబర్ నెలలో తాతయ్య భార్య శ్రీమతి మృణాళినీదేవి జబ్బుతో చనిపోయింది.దీనితో తాతయ్య చాలా కృంగి పోయారు. ఆ బాధ నుంచి ఆయన బయటకు రాలేకపోయాడు.మిగితాది రేపు....