ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య-ప్రమోద్ ఆవంచ
September 9, 2020 • T. VEDANTA SURY • Serial

సాయంత్ర వేళలో తాతయ్య ఎక్కువగా తల్లి దగ్గరే వుండేవాడు.సెలవున్నప్పుడు మాత్రం కింది భాగంలో వుండే నౌకర్ల గదుల వైపు వస్తుండేవాడు.అక్కడ వాళ్ళు తమ పల్లె భాషలో చెప్పుకునే కథలు, మాటలు, దొంగతనాలు, దోపిడీ, బందిపోటు ముచ్చట్లు ఆసక్తిగా వినేవాడు.అప్పుడప్పుడు వాళ్ళు రామాయణ,భారత,భాగవత పురాణాల కథలను,పల్లె పాటలుగా మార్చుకుని పాడుకునేవారు.ఆ పాటలు అంటే తాతయ్యకు చాలా ఇష్టం.
 ఆ రోజుల్లో కరెంట్ వుండేది కాదు.కనీసం కిరసనాయలు కూడా దొరికేది కాదు.ఇంట్లో అన్ని గదుల్లో ఆముదం నూనె దీపాలు వెలిగించే వారు.మిణుకు,మిణుకుమనేఆముదం దీపాల వెలుతురు లో తిరగాలంటే తాతయ్య భయపడే వాడు.బంగళా కింది భాగంలో చాలా చీకటి గదులున్నాయి.చీకటి గదుల్లో దెయ్యాలు, భూతాలు వుంటాయని తాతయ్య నమ్మేవాడు.అంతే కాకుండా ఇంటి వెనక భాగంలో బాదాం చెట్టు మీద ఒక పెద్ద దెయ్యాన్ని చూసాననీ పనిమనిషి చెప్పింది.ఆ దయ్యానికి ఛాతి మీద పెద్ద, పెద్ద కళ్ళు,చేటంత చెవులు, పెద్ద నోరు, పొడవైన నాలుక, వెనుకకు కాళ్ళు, చేతులు పెద్దగా వుండి చెట్టంత ఎత్తులో చీకట్లో వుంటాయని, పని మనిషి భయపెట్టిస్తుండేది.ఆ దెయ్యాలు చీకటి గదుల్లో వుంటాయేమోనని తాతయ్య భయపడే వాడు.అందుకే పల్లె పాటలు, కథలు,విని తాతయ్య అందరూ తిరిగే సమయంలో నే తన గదికి తిరిగి వచ్చేవాడు. మిగితాది రేపు...