ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య-ప్రమోద్ ఆవంచ
November 22, 2020 • T. VEDANTA SURY • Serial

తాతయ్య ఆరోగ్యం దిన దినం చెడిపోతూ, శరీరం శుష్కించి, పూర్తిగా బలహీన పడింది.1941,జులై నెలలో, తాతయ్యను కలకత్తాకు తీసుకెళ్ళారు.తన ప్రియమైన ఆశ్రమం శాంతి నికేతన్ ను,తన రక్తాన్ని,చమటగా చేసి, పెంచిన విశ్వ భారతి ని,ఎప్పటికి వదిలి వెళ్ళపోవలసిన సమయం వచ్చింది.ఆశ్రమవాసులు కడసారిగా శాంతి గేయాలను పాడారు.కలకత్తాలో తాతయ్యను, కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేసారు.కానీ ఫలించలేదు.చివరకు 1941, ఆగస్టు,7వ తేదీన తాతయ్య తన దేహ యాత్రను చాలించాడు.విశ్వకవి ఆశీస్సులు,విశ్వ విశాలమైన వాయువుతో మేళవించి, విశ్వాన్ని సన్మార్గంలో పెడుతాయి...

                 రేపు తాతయ్య జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య ఘట్టాలను తెలుసుకుందాం.