ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య-ప్రమోద్ ఆవంచ
November 6, 2020 • T. VEDANTA SURY • Serial

మొట్టమొదట శాంతి నికేతన్ మన దేశం వరకే కాక ప్రపంచమంతా విస్తరింంపజేయాలనీ సంకల్పించినాడు.తన ప్రియమైన స్నేహితుడు ఆండ్రూస్ కి ఆశ్రమాన్ని అప్పజెప్పి ఆఫ్రికా,ఫిజి,మలయా దేశాలకు వెళ్లి అన్యాయాలకు వ్యతిరేకంగా శాంతియుత విధానాలతో పోరాటం చేసాడు.
మన దేశంలో కూడా బీద కార్మికులకు సహాయపడటానికి ఎన్నో ప్రదేశాలకు పర్యటనలు చేసాడు.
                   1916 వ సంవత్సరం వేసవిలో, తాతయ్య జపాన్ దేశానికి వెళ్ళాడు.అక్కడ జాతీయ వాదాన్ని గురించి టోకియో విశ్వవిద్యాలయంలో ప్రసంగించాడు.జపాన్ నుంచి తాతయ్య అమెరికాకు వెళ్ళాడు.అక్కడ కూడా ఆయనకు శాంతి లభించలేదు.అమెరికాలో వున్నప్పుడు,తన కూతురు బేలా ఆరోగ్యం బాగా లేదని తెలిసి, శాంతి నికేతన్ కు తిరిగివచ్చాడు.అదే సంవత్సరం ఆమె మరణించింది.తాతయ్య దుఃఖం రెండింతలు అయ్యింది.
తాతయ్య యూరోప్ నుండి తిరిగి వచ్చిన తరువాత 1918లో శాంతి నికేతన్ ను ప్రపంచమంతా విస్తరింంపజేయాలనీ, దానికి విశ్వ భారతి అని పేరు పెట్టి శంకుస్థాపన చేశాడు.తాతయ్య జపాన్ యాత్రకు ముందు మహాత్మా గాంధీ,విల్లీ పియర్ సన్, శాంతి నికేతన్ ను చూడడానికి వచ్చారుమిగితాది రేపు....